Pawan Kalyan: ఆ పండుగ వరకే పవన్ సినిమాలలో నటిస్తారా?

గతేడాది వకీల్ సాబ్ సినిమాతో ఈ ఏడాది భీమ్లా నాయక్ సినిమాతో పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా షూటింగ్ నత్తనడకన సాగుతోంది. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఏడాది క్రితమే మొదలైంది. ఏఎం రత్నం నిర్మాతగా 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమా షూటింగ్ నిదానంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఈ సినిమా రిలీజ్ కావడం కష్టమేనని ప్రచారం జరుగుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దసరా పండుగ నుంచి రోడ్లపైనే ఉంటానని ప్రజల సమస్యల గురించి ఊరూరా తిరుగుతానని చెప్పుకొచ్చారు. వైసీపీ నాయకులు ఎన్ని అంటారో అనుకోవాలని పవన్ తెలిపారు.

నేను అన్నీ వింటానని దసరా తర్వాత నేను మొదలుపెడతానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పవన్ దసరా తర్వాత జనసేన పార్టీ కార్యక్రమాలతో బిజీ అవుతానని ప్రకటించడంతో ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల పరిస్థితి ఏంటని అభిమానుల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది. ఆగష్టు నాటికి హరిహర వీరమల్లు షూటింగ్ ను పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ క్రిష్ కు సూచించారని తెలుస్తోంది.

వినోదాయ సిత్తం రీమేక్ కు పవన్ మూడు నుంచి నాలుగు వారాల సమయం కేటాయించాల్సి ఉంటుందని బోగట్టా. ఈ సినిమాకు డేట్స్ కేటాయించడం పవన్ కు కష్టమేమీ కాదు. అయితే పవన్ ప్రకటించిన ఇతర సినిమాల సంగతేంటని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సినిమాల విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది. సినిమాసినిమాకు పవన్ కళ్యాణ్ కు క్రేజ్ పెరుగుతోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus