Kamal Hassan: ప్రాజెక్ట్ కే లో కమల్ హాసన్ నెగిటివ్ పాత్రలో నటించబోతున్నారా?

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్నటువంటి సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్టు కే.వైజయంతి మూవీస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటున్నటువంటి ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకేక్కుతున్న ఈ సినిమాలో కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ విధంగా కమల్ హాసన్ ఈ సినిమాలో నటించబోతున్నారని తెలియడంతో ఈయన ఎలాంటి పాత్రలో నటించబోతున్నారన్న ఆసక్తి అభిమానులలో నెలకొంది. అయితే తాజాగా ఈ సినిమాలో కమల్ హాసన్ ఎలాంటి పాత్రలో నటించబోతున్నారనే విషయం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రాజెక్ట్ K లో ప్రభాస్ ని ఢీ కొట్టబోయే కమల్ హాసన్ రోల్ అత్యంత భయానకంగా ఉండబోతుందట. ఈ ప్రపంచాన్నే తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనే పిచ్చి కోరికతో..

అత్యంత స్వార్ధపరుడిగా, క్రూరుడిగా కమల్ కనిపిస్తారట.కలియుగం ఎలా అంతమవుతుంది, ఎవరి వల్ల అంతమవుతుంది అనేది ఎప్పటినుండో ప్రచారంలో ఉన్నమాటే. ఇప్పుడు అదే ఓ వ్యక్తి స్వార్ధానికి ప్రపంచం ఎలా సతమతమవుతోందనే విషయాన్ని డైరెక్టర్ కమల్ హాసన్ పాత్ర ద్వారా చూపించబోతున్నారని తెలుస్తుంది. ఈ విధంగా కమల్ హాసన్ ను పూర్తిగా నెగిటివ్ క్యారెక్టర్లు చూపించబోతున్నారన్న విషయం తెలియడంతో ఈ సినిమాలో (Kamal Hassan) కమల్ హాసన్ లుక్ ఎలా చూపించబోతున్నారనే విషయం గురించి ఆత్రుత నెలకొంది.

ఇక ఈ విషయం గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ సినిమాపై అభిమానులలో మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమాలో ప్రముఖ స్టార్స్ అయినటువంటి అమితాబచ్చన్, దీపిక పదుకొనే వంటి సెలబ్రిటీలు కూడా భాగమవుతున్న విషయం తెలిసిందే.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus