Project K: ‘ప్రాజెక్ట్ కె’ గ్లిమ్ప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ అండ్ పాన్ ఇండియా చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై సి.అశ్వినీదత్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్ అలాగే తమిళ స్టార్ హీరో కమల్ హాసన్.. వంటి మహామహులు నటిస్తున్న సినిమా ఇది. కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. దిశా పటాని కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ సంగీత దర్శకుడు.

దగ్గుబాటి రానాకి… ఈ చిత్రంతో ఎటువంటి సంబంధం లేకపోయినా ‘ప్రాజెక్ట్ కె’ ని ఇంటర్నేషనల్ మర్కెట్స్ కి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాంటి ‘ప్రాజెక్ట్ కె’ లో ఏముంది? అనేది సాంపుల్ గా ఓ గ్లిమ్ప్స్ రూపంలో తెలియజేశారు. ఈ గ్లిమ్ప్స్ విషయానికి వస్తే ఇది ఒక నిమిషం 16 సెకన్ల నిడివి కలిగుంది. ప్రభాస్ సూపర్ నేచురల్ పవర్స్ ఉన్న హీరోగా కనిపించబోతున్నాడు అని ఈ గ్లింప్స్ క్లారిటీ ఇచ్చేసింది.

ఇక ప్రాజెక్ట్ కె అంటే కల్కి 2898 -AD అంటూ టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు.యాక్షన్ సీక్వెన్స్ లు ఓ రేంజ్లో ఉన్నాయి. హాలీవుడ్ సినిమాలను తలపిస్తున్నాయి.గ్లింప్స్ చివర్లో అమితాబ్ – ప్రభాస్ ల మధ్య ఫైట్ ఉండబోతున్నట్లు వారి చేతులు ఢీ కొట్టుకుంటున్న విజువల్ ను చూపించారు.గ్లింప్స్ అయితే బాగుంది.మీరు కూడా ఓ లుక్కేయండి:

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus