రెండు పార్టులుగా సినిమాలు రూపొందడం అనేది కొత్త విషయం ఏమీ కాదు. భారీ బడ్జెట్ తో రూపొందే సినిమాలు రెండు పార్టులుగా రిలీజ్ అయితే బడ్జెట్ ఈజీగా రికవరీ అవుతుంది. ‘బాహుబలి’ ‘బాహుబలి 2 ‘, ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ‘ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2 ‘ ‘పుష్ప’ ‘పుష్ప 2 ‘ లతో పాటు ‘సలార్’ కూడా రెండు పార్టులుగా రాబోతోంది. ఇప్పుడు ‘ప్రాజెక్ట్ కె’ కూడా రెండు పార్టులుగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రాజెక్ట్ కె (ProjectK) బడ్జెట్ చిత్రాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రూపొందిస్తున్నట్టు నిర్మాత అశ్వినీదత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ రకంగా చూస్తే టాలీవుడ్లో రూపొందే హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఇదే అవుతుంది. అయితే బడ్జెట్ ఇంత అని చిత్ర బృందం రివీల్ చేసిన సందర్భాలు లేవు. కానీ ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమాకి రూ.700 నుంచి రూ.800 కోట్లు బడ్జెట్ అవుతుందని టాక్. భారీ క్యాస్టింగ్ ఉంది. హాలీవుడ్ టీం వి.ఎఫ్.ఎక్స్ కోసం పనిచేస్తుంది.
ఇంత బడ్జెట్ ను రికవరీ చేసుకోవడం అంత ఈజీ కాదు. ఈ సినిమాలో ఎంత ప్రభాస్ నటిస్తున్నప్పటికీ దర్శకుడు నాగ్ అశ్విన్ కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న దర్శకుడు మాత్రమే. పైగా ముందు అతను చేసిన రెండు సినిమాలు కూడా మిడ్ రేంజ్ సినిమాలే. కాబట్టి.. ఈ సినిమాని రెండు పార్టులుగా రిలీజ్ చేయాలని టీం భావిస్తున్నట్టు తెలుస్తుంది.
మొదటి పార్ట్ 2024 జనవరి లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఒకవేళ ఆ డేట్ కి రావడం కష్టమైతే సమ్మర్ లో ఎగ్జామ్స్ సీజన్ ముగిసిన వెంటనే రిలీజ్ చేసేస్తారు. ఇక పార్ట్ 2 కూడా 6 నెలల వ్యవధిలోనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!
రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్ ఫోటోలు వైరల్!