బిగ్ బాస్ హౌస్ లో సూపర్ స్టార్ టాస్క్ అవ్వగానే కాజల్ బెస్ట్ పెర్ఫామర్ గా ఓటింగ్ అప్పీల్ ని చేసింది. ఆ తర్వాత పబ్లిక్ నుంచీ కొన్ని ప్రశ్నలని ఎదుర్కోవాలని, అందులో నిజాయితీగా జవాబు చెప్పిన హౌస్ మేట్ కి మరోసారి ఓట్ అప్పీల్ చేసే అవకాశం వస్తుందని చెప్పాడు బిగ్ బాస్. దీంతో హౌస్ మేట్స్ చాలా ఉత్సుకతతో పబ్లిక్ ఏం అడుగుతారా అని ఎదురుచూశారు. ఇక్కడే శ్రీరామ్ కి, షణ్ముక్ కి వచ్చిన క్వశ్చన్స్ బాగా తగిలాయి.
1. ఫస్ట్ సిరిని అడిగి ప్రశ్న : మీరు షణ్ముక్ కన్నా స్ట్రాంగ్ ప్లేయర్ కదా, మరి మిమ్మల్ని మీరు ఎందుకలా కన్సిడర్ చేసుకోవడం లేదు అని పబ్లిక్ అడిగిన ప్రశ్నకి సిరి ఆన్సర్ చెప్పింది. విన్నర్ గా షణ్ముక్ నే చూడాలని అనుకుంటున్నా అని అందుకే, ఫస్ట్ ప్లేస్ లో పెట్టానని క్లియర్ గా చెప్పింది.
2. తర్వాత కాజల్ కి సాలిడ్ ప్రశ్న ఎదురయ్యింది. అనీమాస్టర్ ఎక్కిరిస్తుంటే డిస్ రెస్పక్ట్ అన్నప్పుడు మరి నువ్వెలా సన్నీపై టిష్యూ పేపర్ విసిరావ్ అని అడిగారు.
దీనికి కాజల్ అతడికి నాకు ఆ చనువు ఉందని, సన్నీ అంటే నాకు చాలా రెస్పెక్ట్ అని, సరదాగా గొడవ పడతాం అంతే అంటూ చెప్పుకొచ్చింది. దీనికి సన్నీ తర్వాత ఫీల్ అయ్యావా అని కాజల్ అడిగితే కాస్త కోపం వచ్చిందని చెప్పాడు.
3. సన్నీ : గిల్టీ బోర్డ్ వేసుకుని తిరిగినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆ ఇన్సిడెంట్ తర్వాత మీ కాన్ఫిడెన్స్‌ను మళ్లీ ఎలా సంపాదించారు. అని అడిగిన ప్రశ్నకి సన్నీ చక్కగా జవాబు ఇచ్చాడు.
ఈ సీజన్ లో అది చాలా బాధించిందని, వీక్ మొత్తం అలాగే ఉన్నానని మరోసారి అలా ఉండకూడదని అనుకున్నానని చెప్పాడు. అంతేకాదు, అద్దంలో చూస్కుంటే నాకు నేను ఎప్పుడూ బూస్టప్ ఇచ్చుకుంటానని అదే నా కాన్ఫిడెన్స్ అంటూ చెప్పొకొచ్చాడు.
4. ఇది శ్రీరామ్ కి బాగా తగిలింది. జెస్సీ ఇష్యూ జరిగినప్పుడు షణ్ముక్ ని ఇన్ మెచ్యూర్ అని చెప్పారు. కానీ, ర్యాంకింగ్ టాస్క్‌లో మీరే షణ్ముక్ మెచ్యూర్ అని, తనను సెకండ్ ప్లేస్‌లో పెట్టారు. అలా ఎలా మీ అభిప్రాయం మారింది ? ఇప్పుడు మీరు షణ్ముర్ గ్రూపులో చేరిపోయారా ? అంటూ సాలిడ్ క్వశ్చన్ అడిగారు. దీనికి శ్రీరామ్ ఇప్పుడు షణ్ముక్ వేరు, అప్పుడు వేరు అంటూ బదులు చెప్పాడు. బాగా కనెక్ట్ అయిన తర్వాత తెలిసిందని ఒప్పుకున్నాడు. ఇప్పుడు చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తున్నాడని చెప్పాడు.కానీ, ఆన్సర్ ఎందుకో అతికినట్లుగా లేదు.
5. మానస్ ని అడిగింది. ఆడియన్స్ దగ్గర మంచి మార్కుల కోసం సన్నీ మిమ్మల్ని ఫ్రెండ్‌లా వాడుకుంటున్నాడని మీకు అనిపిస్తోందా ? దీనికి సాలిడ్ గా సమాధానం చెప్పాడు మానస్. మానస్ వాడుకోవడం లేదని అది చాలా రాంగ్ గా తీస్కున్నారని, అతను చాలా మంచి వ్యక్తి, ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం ఇచ్చేస్తాడని అన్నాడు. అంతేకాదు, నాకెప్పుడు అలా అనిపించలేదని కూడా చెప్పాడు.
6. షణ్ముక్ కి అడగాల్సిన ప్రశ్న వచ్చేసింది. సిరి అంటే మీరు ఎందుకంత పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు ? మీరు సిరిని ప్రతిసారి ఎందుకు కంట్రోల్ చేస్తున్నారంటూ అడిగారు. అంతేకాదు, ఎందుకు తన గేమ్ ని తనలా ఆడనివ్వడం లేదు, ఎందుకు తనలా ఉండనివ్వరు ? అని అడిగిన ప్రశ్నకి షణ్ముక్ సాలిడ్ ఆన్సర్ చెప్పాడు. ఇది నేను ఊహించాను అని, పొసెసివ్ గా ఫీల్ అవుతున్నానని తెలుసు , కానీ కొన్ని సందర్భాల్లో కంట్రోల్ చేయాల్సి వస్తోందని చెప్పాడు. అంతేకాదు, ఏది కంట్రోల్ చేస్తున్నానో, ఏది తన విషయంలో ఫీల్ అవుతున్నానో కన్పూజన్ గా ఉందంటూ చెప్పాడు. ఇక్కడే షణ్ముక్ నాకంటే తనే నన్ను బాగా అర్ధం చేస్కుందని చెప్పుకొచ్చాడు.
ఆ తర్వాత కూడా పబ్లిక్ అడిగిన ప్రశ్నలకి ఆన్సర్ చేశారు హౌస్ మేట్స్. పబ్లిక్ అడిగిన ప్రశ్నలని మనం ఒక్కసారి చూసినట్లయితే,
7. సన్నీ – అందరి ముందు కాజల్ ను ఎందుకు హ్యుమిలియేట్ చేస్తున్నారు. స్టాండ్ తీస్కుని మీకోసం ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇచ్చింది కదా అంటూ అడిగారు.
8. సిరి – రవిని మీరే నామినేట్ చేశారు. ఇన్ఫులెన్సర్ అని పేరు పెట్టారు. మరి, టికెట్ టు ఫినాలే టాస్క్ జరిగేటపుడు మాత్రం ఐలవ్ యూ రవి అంటూ ఎందుకు మాట్లాడారు. అది కరెక్ట్ గేమేనా అంటూ అడిగారు.
9. మానస్ – ప్రియాంక మీ ఫ్రెండ్ అయినపుడు తనని బ్యాక్ బిచ్ ఎందుకు చేశారు ?
10. కాజల్ – ఫస్ట్ లో షణ్ముక్ ఇంకా రవితో క్లోజ్ ఫ్రెండ్ గా ఉన్నారు. ఇప్పుడు మానస్ తో సన్నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. కేవలం ఆటలో ముందుకు వెళ్లడానికి ఇలా చేస్తున్నారా ?
11. ఇక షణ్ముక్ కి మరోసారి సాలిడ్ ప్రశ్న పడింది. ఆడియన్స్ ఇలా చూస్తారు. అలా ఆలోచిస్తారు అవెలా నచ్చుతున్నాయని ఎందుకు ఆడియన్స్ ని జడ్జి చేసి ఫన్ చేస్తున్నారు ? ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పడానికి షణ్ముక్ కాస్త తడబడ్డాడు. ఫన్ చేయడానికి అలా చేయట్లేదని చెప్పాడు కానీ, బయటకి అలా వెళ్లిందా అని మరోసారి ఆలోచించాడు.
12 ఇక ఫైనల్ గా శ్రీరామ్ ని మీరు లోన్లీగా ఉంటారని అంటున్నారు, మరి ఎవిక్షన్ ఫ్రీ పాస్ లో మీరు రవి ఇద్దరూ రెండు ఫోటోలు కాల్చేద్దామని అనుకున్నారు కదా, మరి కాజల్ ఆ పని చేస్తే మీకు కోపం ఎందుకు వచ్చింది ? దీనికి అందరితో కలిసి ఉండాలని అనుకున్నాను అని, ఛాన్స్ ఉన్నప్పుడు అలా చేయడం నాకు నచ్చలేదని చెప్పాడు శ్రీరామ్, గేమ్ ఎథికల్ గా ఆడకపోతే కోపం వస్తుందని చెప్పాడు.
ఇక ఈ రౌండ్ లో సిరి సన్నీ ఇద్దరూ టై అయ్యారు. వీళ్లిద్దరూ మాట్లాడుకుని సన్నీ ఓటింగ్ రిక్వస్ట్ కి వచ్చి ఓట్లు వేయమని పబ్లిక్ ని కోరాడు.