Punch Prasad: ఆ భయంతోనే సర్జరీ చేయించుకోలేదు.. ప్రసాద్ కామెంట్స్ వైరల్!

బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాలలో కమెడియన్ గా సందడి చేస్తూ ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్నటువంటి వారిలో పంచ్ ప్రసాద్ ఒకరు. ఈయన జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో సందడి చేస్తూ వచ్చారు. అయితే గత కొంతకాలంగా ప్రసాద్ కిడ్నీలు పాడవడంతో డయాలసిస్ చేయించుకుంటూ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు కానీ ఈయన ఆరోగ్యం మాత్రం రోజురోజుకు క్షీణిస్తూ ఉంది. కొద్దిరోజుల క్రితం నూకరాజు ఈయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేస్తూ వెంటనే సర్జరీ చేయాలని లేకపోతే ఏ క్షణమైన ఏదైనా జరగవచ్చు అంటూ డాక్టర్లు చెప్పారని తనకు ఆర్థిక సహాయం చేయాలి అంటూ కోరారు.

అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి (Punch Prasad) పంచ్ ప్రసాద్ తాజాగా తన ఆరోగ్యం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.. డాక్టర్లు టాబ్లెట్స్ వాడడం కంటే సర్జరీ చేయించుకోవడమే మంచిదని సలహా ఇచ్చారనీ తెలిపారు.ఇక తాను సర్జరీ అంటే భయపడ్డానని తెలిపారు. కొంతమందికి ఈ సర్జరీ సక్సెస్ అవుతుందని మరి కొంతమందికి సక్సెస్ కాదని తెలిసి భయపడ్డానని అందుకే సర్జరీ చేయించుకోవడానికి కాస్త వెనకడుగు వేశానని తెలిపారు.

ఇక తనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు జబర్దస్త్ ఆర్టిస్టులతో పాటు నాగబాబు రోజా కూడా తనకు చాలా సహాయం చేశారని ప్రసాద్ తెలిపారు. ఇక ఒకప్పుడు చాలామంది నాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన తానే వద్దని చెప్పానని ప్రసాద్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక తన భార్య గురించి మాట్లాడుతూ తన భార్య తనని ఒక చంటి బిడ్డలా చూసుకుందని తెలిపారు. తన పిల్లల కన్నా నాపైనే ఎక్కువ శ్రద్ధ తీసుకుందని ప్రసాద్ వెల్లడించారు.

తన భార్య కనక లేకపోతే నేను ఐదు సంవత్సరాల క్రితమే చనిపోయి ఉండేవాడిని అంటూ తన భార్య తనకు చేస్తున్నటువంటి సేవలను తెలియజేస్తూ ఈయన ఎమోషనల్ అయ్యారు. ఇక తన పిల్లల గురించి మాట్లాడుతూ వారిని తలచుకుంటే అసలు కన్నీళ్లు ఆగవని ఈయన ఎమోషనల్ అవుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus