Punch Prasad: ఫ్యామిలీ ఫోటో చూపించి అందరిని ఏడిపించేసిన పంచ్ ప్రసాద్.. ఏమైందంటే?

జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పంచ్ ప్రసాద్ జబర్దస్త్ కార్యక్రమంలో మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా తన పంచ్ డైలాగులతో అందరినీ నవ్వించే ప్రసాద్ తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే.ఈయన రెండు కిడ్నీలు పాడవడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పంచ్ ప్రసాద్ అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉండగా జబర్దస్త్ కమెడియన్స్ జడ్జిల సహాయంతో చికిత్స తీసుకుంటూ నిత్యం డయాలసిస్ చేయించుకుంటూనే బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.

గత కొద్ది రోజుల క్రితం కూడా ఈయన నడవలేని స్థితిలోకి వెళ్లిపోయి ఎంతో నరకాన్ని అనుభవించారు. అయితే మెల్లిమెల్లిగా తన ఆరోగ్యం కుదుటపడటంతో తిరిగి బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. తాజాగా ఈ ఆదివారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఎప్పటిలాగే అందరూ తమ ఆటపాటలతో పంచ్ డైలాగులతో అందరిని నవ్వించారు. అయితే చివరిలో మాత్రం పంచ్ ప్రసాద్ తన ఫ్యామిలీ ఫోటోని చూపించి ఎంతో ఎమోషనల్ అయ్యారు.

చిన్నప్పుడు తన తల్లిదండ్రులతో పాటు అన్నయ్య అక్కయ్యతో కలిసి దిగిన ఫ్యామిలీ ఫోటోని చూపించారు. ఈ ఫోటోని చూపిస్తూ ఇందులో నేను అమ్మ తప్ప ఎవరు బ్రతకలేదని అందరూ చనిపోయారంటూ ఎమోషనల్ అయ్యారు. తనకు ఒక అన్నయ్య ఒక అక్కయ్య కూడా ఉండే వాళ్ళని తన అన్నయ్య థియేటర్ ఆర్టిస్ట్ గా పని చేసేవారు తనని చూసి నేను కూడా ఇండస్ట్రీలోకి వచ్చాను.

అయితే ఇప్పుడు నేను అమ్మ తప్ప వీళ్ళు ఎవరూ లేరు అంటూ తన ఫ్యామిలీ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తరచూ పంచ్ డైలాగులతో అందరినీ నవ్వించే ప్రసాద్ జీవితంలో ఇంత విషాదం ఉందా అని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎమోషనల్ అయ్యారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus