Puneeth Rajkumar, Sr NTR: పునీత్ కు ఆ బహుమతిని ఇచ్చిన సీనియర్ ఎన్టీఆర్!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఆస్పత్రి చేరి చికిత్సకు కోలుకోలేక మృతి చెందారు. పునీత్ రాజ్ కుమార్ జూనియర్ ఎన్టీఆర్ కు సన్నిహితుడనే సంగతి తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ నటించిన చక్రవ్యూహ సినిమా కొరకు జూనియర్ ఎన్టీఆర్ పాట పాడారు. పునీత్ రాజ్ కుమార్ కు జూనియర్ ఎన్టీఆర్ తో మంచి రిలేషన్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే సీనియర్ ఎన్టీఆర్ కూడా పునీత్ రాజ్ కుమార్ పై ఒక సందర్భంలో ప్రేమను కనబరిచారట.

పునీత్ ఒక సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను చెప్పుకొచ్చారు. తనకు ఐదు సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో నాన్న రాజ్ కుమార్ తో కలిసి ఏవీఎం స్టూడియోస్ కు వెళ్లానని అక్కడ సీనియర్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆ సినిమాలో ఎన్టీఆర్ రేస్ కార్ డ్రైవర్ గా నటించారని పునీత్ చెప్పుకొచ్చారు. ఆ రేస్ కార్ ను చూసి తాను ముచ్చటపడ్డానని తన తండ్రితో కూడా అదే విషయాన్ని చెప్పానని పునీత్ పేర్కొన్నారు.

అలాంటి కారు కావాలని తాను అడగగా అది గమనించిన ఎన్టీఆర్ తన ఇంటికి రేస్ కారును పంపించారని పునీత్ వెల్లడించారు. అయితే ఆ కారును తమతో ఉంచుకోకుండా తిరిగి పంపించామని పునీత్ పేర్కొన్నారు. బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు ప్రమోషన్స్ లో భాగంగా పునీత్ రాజ్ కుమార్ ఈ విషయాలను వెల్లడించారు. పునీత్ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వ లాంఛనాలతో పునీత్ అంత్యక్రియలు జరగనున్నాయని తెలుస్తోంది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus