Ashwini Puneeth Rajkumar: పునీత్ భార్య అశ్విన్ ఎంత త్యాగం చేస్తోందో తెలుసా..!

కన్నడ నాట చిన్న వయసులోనే సూపర్ స్టార్ ఇమేజ్ తో దూసుకుపోయాడు దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్. అలనాటి స్టార్ హీరో రాజ్ కుమార్ చిన్న కుమారుడు అయిన‌ పునీత్ బాల నటుడుగానే కన్నడ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హీరోగా ఎదిగి స్టార్ హీరోగా ఎన్నో మంచి సినిమాలలో నటించాడు. పునీత్ రాజ్ కుమార్ కేవలం హీరో మాత్రమే కాదు.. మంచి సమాజ సేవకుడు కూడా.. అతను చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు ఎంతోమంది పేదలను ఆదుకున్నాయి.

తాను ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా ఏ రోజు పునీత్ స్వయంగా వాటి గురించి చెప్పుకోలేదు. కానీ పునీత్ చనిపోయాక లక్షల మంది బయటకు వచ్చి తాము పునీత్ రాజ్‌కుమార్ వల్ల ఎలా ? లబ్ది పొందామో చెప్పారు. ఎంతో గొప్పగా దానాలు చేసిన కూడా ఎవరికీ తెలియలేదు అంటే పునీత్ గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. పునీత్ చనిపోయేక కూడా పునీత్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అలాగే కంటిన్యూ చేస్తూ వస్తుంది ఆయన భార్య అశ్విని.

పునీత్ కి భార్య(Ashwini Puneeth Rajkumar) అశ్విని, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పునీత్ మరణాంతరం అశ్విని తన భర్త అభిమానులను ఎప్పుడు కనిపెట్టుకుంటూనే వస్తున్నారు. ఎవరికీ ఎలాంటి ఆపద ఉన్నాన్న తాను ఉన్నాను అంటూ ముందుకు వస్తున్నారు. అభిమానంతో ఎవరు పిలిచిన వారి దగ్గరికి అశ్విని వెళుతున్నారు. స్టార్ స్టేటస్ ఉన్నప్పుడు కూడా అశ్విని ఎప్పుడు లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తూ వచ్చారు. మరి ముఖ్యంగా పునీత్ చనిపోయాక అశ్విని వేషధారణ కూడా అభిమానులను కన్నీళ్లు పెట్టిస్తోంది.

హిందూ సంప్రదాయం ప్రకారం భర్త చనిపోతే భార్య బొట్టు, గాజులు, పువ్వులు ధరించరు. కానీ ఈ తరం స్త్రీలు అలాంటివి పట్టించుకోవడం లేదు. అయితే అశ్విని మాత్రం ఈ విషయంలో హిందూ సంప్రదాయం పాటిస్తూ నిక్క‌చ్చిగా ఉంటుంది. పునీత్‌తో పాటు అన్ని త్యాగం చేసే పూర్తిస్థాయి హిందూ స్త్రీగా మారిన ఆమె.. అటు పునీత్ అభిమానులకు కూడా ఎప్పుడు అండదండలు అందిస్తూ వారు ఏ కార్యక్రమాలకు పిలిచినా కాదనకుండా వెళుతున్నారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus