పంజాబ్ లో శ్రీ బ్రార్ అనే ర్యాప్ సింగర్ ఉన్నారు. రీసెంట్ గా అతడు ‘జాన్’ అనే వీడియో సాంగ్ చేశాడు. ఈ పాటలో ఆయన పోలీసులపై గన్స్ ఎక్కుపెడతాడు. ఈ సాంగ్ యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. అయితే ఈ పాట గన్ కల్చర్ ని ప్రోత్సహించినట్లు ఉందనే కారణంతో పోలీసులు బ్రార్ ను అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ పై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కూడా స్పందించడం విశేషం. దానికి కారణం ఈ పాటలో ప్రభుత్వ తీరుని తప్పుపట్టి చూపించడమే అని తెలుస్తోంది.
నెల క్రితం విడుదలైన ‘జాన్’ సాంగ్ లో శ్రీ బ్రార్ తో పాటు వీడియో బార్బీ మాన్ అనే లేడీ ర్యాపర్, గుర్నీత్ దొసాంజ్ అనే పాప్ ఆర్టిస్ట్ నటించారు. అయితే సాహిత్యం అందించింది మాత్రం శ్రీ బ్రారే. ఈ సాంగ్ లో గుర్నీత్ రెండు గన్స్ ని పట్టుకొని పోలీసు స్టేషన్ లోకి వెళ్లి.. అక్కడున్న పోలీసులను చంపేసి.. తన స్నేహితులను విడిపించుకొని వెళ్తాడు. ఈ దృశ్యాల వెనుక బ్రార్ రాసిన సాంగ్ రన్ అవుతుంటుంది. లిరిక్స్ మొత్తం కూడా పోలీసులను తక్కువ చేసేలా ఉండంతో పాటు..
గన్ కల్చర్ ని ప్రోత్సహించే విధంగా ఉండడంతో శ్రీ బ్రార్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. పటియాలా సీనియర్ సూపరింటెండెంట్ విక్రమ్ జీత్ దుగ్గల్ అతడిపై కేసు పెట్టారు. హింసను ప్రేరేపించడం, సంఘ విద్రోహశక్తులను పురికొల్పడం, గ్యాంగ్‌స్టర్‌లకు ఆశ్రయం.. ఇవన్నీ వీడియోలో చూపించడంతో ప్రభుత్వం అతడిపై మండిపడుతోంది. 2016లో పాప్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన బ్రార్.. సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి ఈ కేసు నుండి ఎలా బయటపడతాడో చూడాలి!