ఇప్పుడు టాలీవుడ్ కు పెద్ద దిక్కు అంటే మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పాలి. ఇటీవల తెలుగు ఫెడరేషన్ వర్కర్స్ సమ్మె బాట పట్టి.. దాదాపు నెల 20 రోజుల పాటు షూటింగ్లు ఆగిపోతే.. ఆ ఇష్యూని సాల్వ్ చేసింది చిరంజీవి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి ముందు కూడా చాలా సమస్యలను చిరంజీవి దగ్గరుండి పరిష్కరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక సినిమాల పరంగా చూసుకున్నా.. మెగా ఫ్యామిలీ నుండి హీరోలు ఎక్కువగానే ఉన్నారు. దాదాపు 8 మంది హీరోలు మెగా ఫ్యామిలీ నుండి ఉండగా.. అందులో చిరుతో పాటు రాంచరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి నలుగురు స్టార్లు ఉన్నారు.
Mega Comeback
వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్..లకి కూడా సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే కొన్నాళ్ల నుండి మెగా హీరోలను వరుస ప్లాపులు వెంటాడుతున్నాయి. 2023 లో చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ పెద్ద హిట్ అయ్యింది. దాని తర్వాత వచ్చిన భోళా శంకర్ పెద్ద డిజాస్టర్ అయ్యింది. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన ‘బ్రో’ ‘హరి హర వీరమల్లు’ సినిమాలు కూడా డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. చరణ్ 3 ఏళ్ళు కష్టపడి చేసిన ‘గేమ్ ఛేంజర్’ కూడా ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇక వరుణ్ తేజ్ ఖాతాలో అయితే దాదాపు 4 డిజాస్టర్స్ ఉన్నాయి. వైష్ణవ్ తేజ్ ‘ఆది కేశవ’ ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది.
ఆ తర్వాత అతను ఇంకో సినిమా చేయలేని పరిస్థితి. ఇలాంటి టైంలో మెగా హీరోలకు ఓ సాలిడ్ హిట్ పడితే మంచి జోష్ వస్తుంది. ఆ గడియలు కూడా రానే వచ్చినట్టు అనిపిస్తుంది. ‘ఓజి’ తో పవన్ కళ్యాణ్ సాలిడ్ హిట్ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే చిరు – అనిల్ రావిపూడి సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టే ఛాన్స్ ఉంది. ఇక రాంచరణ్ కూడా ‘పెద్ది’ తో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని కష్టపడి పనిచేస్తున్నాడు. ఈ 3 ప్రాజెక్టులపై పాజిటివిటీ కూడా ఉండటం ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి.