Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Tribanadhari Barbarik Movie: త్రిబాణధారి బార్బరిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Tribanadhari Barbarik Movie: త్రిబాణధారి బార్బరిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • August 29, 2025 / 09:10 AM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Tribanadhari Barbarik Movie: త్రిబాణధారి బార్బరిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సత్య రాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ (Hero)
  • సాంచి రాయ్, ఉదయ భాను (Heroine)
  • వీ టీవీ గణేష్,క్రాంతి కిరణ్ (Cast)
  • మోహన్ శ్రీవత్స (Director)
  • విజయ్ పాల్ రెడ్డి అడిదల (Producer)
  • ఇన్ఫ్యూజన్ బ్యాండ్ (Music)
  • కుశేందర్ రమేష్ రెడ్డి (Cinematography)
  • ఎస్ బి ఉద్ధవ్ (Editor)
  • Release Date : ఆగస్టు 29, 2025
  • వానర సెల్యూలాయిడ్ (Banner)

తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. సీనియర్ యాంకర్ ఉదయభాను కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. టీజర్, ట్రైలర్ వంటివి ఇంప్రెసివ్ గానే అనిపించాయి. మరి సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి :

Tribanadhari Barbarik Review

Tribanadhari Barbarik Review and Rating1

కథ: కొడుకు కోడల్ని పోగొట్టుకుని మనవరాలు నిధి (మేఘన) సర్వస్వంగా జీవిస్తుంటాడు సైకాలజిస్ట్ శ్యామ్ కతు (సత్య రాజ్). అందరి మైండ్ సెట్, లోపాలు, వాటికి పరిష్కారాలు తెలిసినప్పటికీ.. మనవరాలు టైంకి కనబడకపోతే విలవిలలాడిపోతుంటాడు. అయితే ఒకరోజు తన మనవరాలు ఊహించని విధంగా మిస్ అవుతుంది. మరో వైపు రామ్ (వశిష్ట ఎన్ సింహా) విదేశాలకు వెళ్లి సెటిల్ అవ్వాలని ఆశపడతాడు. అందుకు 30 లక్షలు అవసరం పడుతుంది. దానికోసం అతను క్యాబ్ డ్రైవర్ గా చేస్తుంటాడు. ఈ క్రమంలో అతనికి సత్య (సాంచీ రాయ్) పరిచయం అవుతుంది. మరోపక్క రామ్ స్నేహితుడు దేవ్(క్రాంతి కిరణ్) డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుంటాడు. వీరికి శ్యామ్ మనవరాలి మిస్సింగ్ కి సంబంధం ఏంటి? మరోపక్క పాల వ్యాపారం చేసుకునే లేడీ డాన్ వాకిలి పద్మ (ఉదయభాను) దేవ్ కి ఏమవుతుంది.? చివరికి శ్యామ్ మనవరాలు తిరిగి అతన్ని చేరుకుందా? అందుకు అతను చేసిన ప్రయత్నాలు ఏంటి? అనేది మిగిలిన కథ.

Tribanadhari Barbarik Review and Rating1

నటీనటుల పనితీరు: సైక్రియార్టిస్ట్ ఆల్మోస్ట్ టైటిల్ రోల్ పోషించారు. ఎప్పటిలానే తన మార్క్ నటనతో పాత్రకు నిండుతనం తీసుకొచ్చారు. డబ్బింగ్ విషయంలో కొత్తగా ట్రై చేశారు. వశిష్ట పోషించిన విలక్షణ పాత్ర మెప్పిస్తుంది. సత్యం రాజేష్ కూడా చాలా బాగా చేశాడు. వీ టీవీ గణేష్ కామెడీ రోల్ కాకుండా ముఖ్య పాత్ర పోషించడం విశేషం. చాలా రోజుల తర్వాత ఉదయభానుకి మంచి పాత్ర దొరికింది. ఆమె లుక్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు. సాంచీ రాయ్, మేఘన, కార్తికేయ మొట్ట రాజేంద్రన్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

Tribanadhari Barbarik Review and Rating1

సాంకేతిక నిపుణుల పనితీరు: మహాభారతంలో ఘటోత్కచుని కుమారుడు మరియు భీముని మనవడు బార్బరికుడు అని ఎక్కువ మందికి తెలియదు.ఇతను వాడే మూడు బాణాలకి కురుక్షేత్ర యుద్ధం యొక్క గమనాన్ని మార్చగల సమర్థత ఉందని కూడా చెబుతుంటారు. అలాంటి ఒక పాత్రను తీసుకుని ఈ ‘త్రిబాణధారి బార్బరిక్’ కథని డిజైన్ చేసుకున్నాడు దర్శకుడు మోహన్ శ్రీవత్స. తన మనవరాలు మిస్ అవ్వడానికి, ఆమెను వేధించిన వారిని బార్బరిక్ గా మారి వారికి ఎలా బుద్ధి చెప్పాడు?’ అనేది మెయిన్ థీమ్. అయితే నేటి తరం యువత ఆలోచనా విధానం, అలవాట్ల వల్ల ఆడపిల్లలకు ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి అనే సెన్సిటివ్ టాపిక్ ను కూడా దర్శకుడు టచ్ చేశారు.అతని ప్రయత్నం మంచిదే.

అయితే కథనం చాలా వరకు కన్ఫ్యూజ్ చేస్తూ సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో ముందుకు, వెనక్కి వెళ్లే విధానం కామన్ ఆడియన్స్ కి రుచించదు. సెకండాఫ్ ప్రారంభంలో వచ్చే సన్నివేశాలు కూడా ఆసక్తిగా సాగవు. కానీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్..లు, ఇచ్చిన మెసేజ్ కన్విన్సింగ్ గా అనిపిస్తాయి.నూతన నిర్మాత అయినప్పటికీ విజయ్ పాల్ రెడ్డి అడిదల ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు చేశారు. కథ ఏం డిమాండ్ చేస్తే అది సమకూర్చారు. క్యాస్టింగ్ ను ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. టెక్నికల్ టీం కూడా కష్టపడి పని చేసింది అని ప్రతి ఫ్రేమ్ చెబుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు ఓకే. నిడివి 2 గంటల 8 నిమిషాలే ఉండటం మరో ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి.

Tribanadhari Barbarik Review and Rating1

విశ్లేషణ: చివరిగా ‘త్రిబాణధారి బార్బరిక్’ మంచి పాయింట్ తీసుకున్నప్పటికీ గ్రిప్పింగ్ నెరేషన్ లేకపోవడం వల్ల ఓ సాదా సీదా సినిమాగా మిగిలిపోతుంది. థియేటర్లలో నిలబడుతుందో లేదో చెప్పలేం కానీ ఇలాంటి సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు ఉన్నాయి.

Tribanadhari Barbarik Review and Rating1

రేటింగ్ : 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Barbarik
  • #Mohan Srivatsa
  • #Satya Raj
  • #Satyam Rajesh
  • #Tribanadhari Barbarik

Reviews

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Pankaja: ఆస్కార్‌ బరిలో మన మురికివాడల కథ..  తెలుగమ్మాయిలు సాధిస్తారా?

Pankaja: ఆస్కార్‌ బరిలో మన మురికివాడల కథ.. తెలుగమ్మాయిలు సాధిస్తారా?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

RC 17: చరణ్‌ – సుక్కు సినిమాలో ఆమె ఫిక్స్‌.. హింట్‌ ఇచ్చిన నిర్మాత

RC 17: చరణ్‌ – సుక్కు సినిమాలో ఆమె ఫిక్స్‌.. హింట్‌ ఇచ్చిన నిర్మాత

Sai Pallavi: సూపర్‌ సెంతామరయ్‌.. మూడుకు మూడు డిఫరెంట్‌.. ఎలా ఎలా?

Sai Pallavi: సూపర్‌ సెంతామరయ్‌.. మూడుకు మూడు డిఫరెంట్‌.. ఎలా ఎలా?

Vivek Athreya: ఇబ్బందిపెడుతున్న గతం… మొన్న విజయ్‌.. ఇప్పుడు వివేక్‌ ఆత్రేయ.. నెక్స్ట్‌ ఎవరు?

Vivek Athreya: ఇబ్బందిపెడుతున్న గతం… మొన్న విజయ్‌.. ఇప్పుడు వివేక్‌ ఆత్రేయ.. నెక్స్ట్‌ ఎవరు?

Varanasi: అనుకున్నదే జరుగుతోంది.. ఈసారి నెపం VFX టీమ్‌ మీద..

Varanasi: అనుకున్నదే జరుగుతోంది.. ఈసారి నెపం VFX టీమ్‌ మీద..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 55 సినిమాలు విడుదల

13 hours ago
Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

Bhogi: ‘భోగి’ సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఇవే..!

1 day ago
Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago
Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

2 days ago
Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Satvika Veeravalli: ఆమె తెలుగమ్మాయే కానీ తెలుగమ్మాయి కాదు.. ఎందుకనో తెలుసా?

Satvika Veeravalli: ఆమె తెలుగమ్మాయే కానీ తెలుగమ్మాయి కాదు.. ఎందుకనో తెలుసా?

2 days ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి.. ఆ రోజు ఢిల్లీ అయి ఉంటే ఎలా ఉండేదో? ఆ ఊహే అదుర్స్‌

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి.. ఆ రోజు ఢిల్లీ అయి ఉంటే ఎలా ఉండేదో? ఆ ఊహే అదుర్స్‌

2 days ago
Nandi Award: ఫైనల్లీ నంది అవార్డుల జీవో జారీ.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే..

Nandi Award: ఫైనల్లీ నంది అవార్డుల జీవో జారీ.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే..

2 days ago
Lenin: జపాన్‌ వెళ్తున్న ‘లెనిన్‌’… మరి ‘సామ’ ఫ్యాన్స్‌ ఏం చేస్తారో మరి?

Lenin: జపాన్‌ వెళ్తున్న ‘లెనిన్‌’… మరి ‘సామ’ ఫ్యాన్స్‌ ఏం చేస్తారో మరి?

2 days ago
AA23: ఏంటీ… అల్లు అర్జున్‌ ఏడాదికే కొత్త సినిమాతో వచ్చేస్తాడా?

AA23: ఏంటీ… అల్లు అర్జున్‌ ఏడాదికే కొత్త సినిమాతో వచ్చేస్తాడా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version