పూరి ట్వీట్ వేసాడు సరే.. హీరో ఎవరు?

మహేష్ బాబు- పూరి జగన్నాథ్.. ఈ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.’పోకిరి’ వంటి ఇండస్ట్రీ హిట్ అలాగే ‘బిజినెస్ మెన్’ వంటి బ్లాక్ బస్టర్.. చిత్రాలు ఈ కాంబినేషన్ నుండీ వచ్చాయి. ‘నేను పూర్తి కథ చెప్పకుండానే మహేష్ ‘బిజినెస్ మెన్’ సినిమా చేసాడు. నేనంటే అతనికి అంత నమ్మకం’ అంటూ చెప్పిన పూరి.. గత ఏడాది ‘నేను హిట్లలో ఉంటేనే.. మహేష్ నాతో సినిమా చేస్తాడు లేకపోతే చెయ్యడు’ అంటూ కామెంట్ చెయ్యడం మహేష్ ఫ్యాన్స్ కు మండేలా చేసిందనే చెప్పాలి.

‘జన గణ మన’ అనే కథ రాసుకుని ఎప్పుడో మహేష్ వద్దకు వెళ్ళాడు పూరి. కానీ మహేష్ కు ఈ స్క్రిప్ట్ నచ్చ లేదు. మార్పులు చెయ్యమని చెప్పాడు. అసలే పూరి డ్రీం ప్రాజెక్టు ఇది. అందుకే కాంప్రమైజ్ కాలేదు. ‘చేస్తావా.. చెయ్యవా.. అన్నట్టు మహేష్ చుట్టూ తిరిగాడు’. ఇక మహేష్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో పూరీని పట్టించుకోలేదు. అయితే పూరి మాత్రం ‘జన గణ మన’ కథ పట్టుకుని.. పవన్ కళ్యాణ్, ప్రభాస్, ‘కె.జి.ఎఫ్’ హీరో యష్, వంటి వారిని కలిసాడు. కానీ వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు.

ఇక ఈ మధ్యనే అభిమానులతో ఛాట్ చేసిన మహేష్.. ‘పూరితో సినిమా చెయ్యడానికి నేను రెడీ’ అని చెప్పుకొచ్చాడు. దాంతో మరోసారి మహేష్ ను పూరి కలిసినట్టు వార్తలు వచ్చాయి. ఇక ఈరోజు పూరి.. ” ‘జన గణ మన’ నా డ్రీమ్ ప్రాజెక్ట్. నేను తప్పకుండా ఈ సినిమా చేస్తాను. అంతేకాదు.. పాన్ ఇండియా కథాంశమిది.త్వరలోనే నా డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది” అంటూ ట్వీట్ చేసి ఈ ప్రాజెక్ట్ పై ఎంత ఆసక్తి ఉందో తెలియజేసాడు. అయితే ఏ హీరోతో చేస్తున్నాడు అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది.

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus