డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ నిన్న 54వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి. పూరి జగన్నాధ్ ని ఓ దర్శకుడు హీరోగా చూపించాలని చాలా ప్రయత్నాలు చేశారట. ఐతే పూరి మాత్రం దానికి ససేమిరా అన్నారట. దర్శకుడు మరియు స్క్రీన్ రైటర్ డి ఎస్ కణ్ణన్ సారాయి వీర్రాజు మూవీ చేశారు. నర్సీపట్నం నేపథ్యంలో నడిచే ఈ విలేజ్ డ్రామాలో హీరోగా పూరి జగన్నాధ్ అయితే బాగుంటారని కణ్ణన్ భావించారట.
వాస్తవంలో పూరి జగన్నాధ్ సొంత ఊరు నర్సీపట్నమే దీనితో సారాయి వీర్రాజు పాత్రకు పూరి బాగా సెట్ అవుతారని పూరి చేయాలని కణ్ణన్ తాపత్ర పాడ్డారట. స్క్రిప్ట్ నచ్చకో, హీరోగా చేయడం ఇష్టంలేకో పూరి ఎంత బ్రతిమలాడినా ఆ మూవీ చేయడానికి ఒప్పుకోలేదట. ఇక చేసేదేమి లేక సారాయి వీర్రాజులో హీరోగా అజయ్ ని తీసుకోవడం జరిగింది. ఒక వేళ పూరి ఒప్పుకొని ఉంటే హీరోగా కూడా పూరిని ఆయన అభిమానులు చూశేవారు. ఐతే చాలా సినిమాలలో పూరి దర్శకుడిగా క్యామియో రోల్స్ చేశారు.
ఏమాయ చేశావే మూవీలో పూరి దర్శకుడిగా కొన్ని సన్నివేశాలలో కనిపిస్తాడు. జయాపజయాల ప్రమేయం లేకుండా పూరి సినిమాలను ఆదరించే అభిమానులు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం పూరి హీరో విజయ్ దేవరకొండతో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామాలో విజయ్ ఫైటర్ గా కనిపించనున్నాడు. పాన్ ఇండియా మూవీగా పలు భాషలలో విడుదల కానుంది.