Puri Jagannadh: హెల్త్ కేర్ సిస్ట‌మ్‌పై పూరి వ్యాఖ్యలు

దేశంలో ఎక్కడ చూసినా ఇప్పుడు చర్చలు జరుగుతున్న టాపిక్‌… ఆరోగ్యం. ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. కరోనా పరిస్థితుల వల్ల హెల్త్‌ కేర్‌ సిస్టమ్‌ గురించి డిస్కషన్స్‌ జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఎక్కడ హెల్త్‌ కేర్‌ బాగుంది అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో పూరి జగన్నాథ్‌ తన మ్యూజింగ్స్‌లో హెల్త్‌ కేర్‌ సిస్టమ్‌ గురించి మాట్లాడారు. ప్రపంచంలోనే నెంబర్‌ 1 హెల్త్‌ కేర్‌ సిస్టమ్‌ ఎక్కడ ఉంది, అదెలా పని చేస్తుంది లాంటి విషయాలు చెప్పారు. అవేంటో ఆయన మాటల్లోనే…

రాత్రి, ప‌గ‌లు క‌ష్ట‌ప‌డి ఆస్తులు కూడబెడుతోంది పిల్లల చ‌దువుల కోసమే. ఆరోగ్య స‌మ‌స్య‌లకి, సొంత ఇంటికి, వృద్ధాప్యం కోసం ఆ డబ్బులు దాచుకుంటాం. వీట‌న్నింటి కోసం ఎంత డ‌బ్బు కావాలో మనకు తెలీదు. కామ‌న్‌వెల్త్‌ దేశాల్లో సిస్ట‌మ్ చాలా బాగుంటుంది. యూరప్‌, కెన‌డా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో పిల్లలకు బేసిక్ ఎడ్యుకేష‌న్ ఉచితం. పై చ‌దువుల కోసం ప్ర‌భుత్వం నుండి అప్పు తీసుకుని, ఉద్యోగం వ‌చ్చాక మెల్ల‌గా తీర్చుకోవచ్చు. స్కాట్లాండ్‌లో అయితే ఎంత చ‌దివినా, ఎన్నేళ్లు చ‌దివినా పూర్తిగా ఉచిత‌మే అంటూ విద్య కోసం చెప్పుకొచ్చారు పూరి.

ముందుగా చెప్పుకొన్న ఆ కామన్‌వెల్త్‌ దేశాల్లో నేష‌న‌ల్ హెల్త్ కేర్ సిస్ట‌మ్ ప్ర‌పంచ‌లోనే నంబ‌రు 1. ప్రతి సిటిజ‌న్‌కీ ప్రైమ‌రీ కేర్ ఫిజిషియ‌న్ ఉంటారు. అత‌నికి ఆ వ్యక్తి గురించి మొత్తం తెలిసుంటుంది. హెల్త్ రికార్డు పేరుతో మొత్తం జాబితా అతని దగ్గర ఉంటుంది. ఏదైనా సర్జరీ చేయాల్సి వస్తే చికిత్స ఉచితం. ఆ తర్వాత ఉచితంగా 5 స్టార్ హోటల్‌ రేంజ్‌ ఫుడ్‌‌ పెడతారు. ఒకవేళ జీవితాంతం బెడ్ మీదే ఉండాల్సిన ప‌రిస్థితి వ‌స్తే చివ‌రి వ‌ర‌కు చూసుకుంటారు. దాన్ని రెసిడెన్షియ‌ల్ కేర్ అంటారు. ప్రజల ఆరోగ్యం కోసం అక్కడి ప్ర‌భుత్వం ఎన్ని కోట్లైనా ఖ‌ర్చుపెడుతుంది. ఆయా దేశాల్లో పుట్టినా, అక్క‌డి సిటిజ‌న్‌షిప్ ఉన్నా ఇక ఆరోగ్యం గురించి ఆందోళ‌న అక్కర్లేదు. అలాంటి హెల్త్ కేర్ సిస్ట‌మ్ మ‌న ఇండియాలో కూడా రావాల‌ని కోరుకుందాం అని అన్నారు పూరి జగన్నాథ్‌.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus