Puri Jagannadh: డబుల్ ఇస్మార్ట్ విషయంలో ఆ హీరోయిన్లకు ఛాన్స్ ఇవ్వనన్న పూరి!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ రామ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన సక్సెస్ అందుకుంది. ఈ సినిమా ద్వారా మరోసారి ఫామ్ లోకి వచ్చిన పూరి జగన్నాథ్ పలు సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు.అయితే ఈ సినిమా తర్వాత పూరి దర్శకత్వంలో వచ్చిన సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లకు కూడా ఇతర సినిమాలలో నటించే అవకాశాలు వచ్చిన ఈ సినిమా ఈ స్థాయిలో ఏవి గుర్తింపు తీసుకు రాలేదని చెప్పాలి.

ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ (Puri Jagannadh) మరోసారి సక్సెస్ అందుకోవడం కోసం ఈ స్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ చిత్రంగా డబుల్ ఇస్మార్ట్ పేరిట ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా కోసం ఈ స్మార్ట్ శంకర్ సినిమాకు పనిచేసిన టీం చాలా మందిని తీసుకున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్లుగా నిధి అగర్వాల్ నభానటేష్ నటించిన సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరికి ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందించింది.

అయితే ఈ సినిమా తర్వాత వీరికి కూడా పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పాలి.అయితే డబల్ ఇస్మార్ట్ శంకర్ విషయంలో మాత్రం పూరి జగన్నాథ్ వీరికి కాస్త అన్యాయం చేస్తున్నారని చెప్పాలి. ఈ సినిమాలో హీరోయిన్లుగా వీళ్ళని కాకుండా బాలీవుడ్ హీరోయిన్లను తీసుకోవాలని ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి పూరి సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో మార్కెట్ సొంతం చేసుకోవడం కోసం ఈయన బాలీవుడ్ సెలబ్రిటీలు అయినటువంటి సారా అలీ ఖాన్ శ్రద్ధ కపూర్ ఇద్దరు హీరోయిన్లను తీసుకోవాలని చాలా ఆసక్తి కనబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయనున్నట్లు సమాచారం.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus