Chiranjeevi,Puri Jagannadh: మెగాస్టార్ సినిమాలో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గెస్ట్ రోల్!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఓ సినిమాలో స్టార్ డైరెక్టర్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు. రీఎంట్రీలో మెగాస్టార్ వరుస సినిమాలను లైన్ లో పెడుతోన్న సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో ఆయన నటించిన ‘ఆచార్య’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ హీరో ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటిస్తున్నారు. మలయాళంలో తెరకెక్కిన ‘లూసిఫర్’ సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

అలానే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ క్యామియో రోల్ పోషిస్తున్నారు. కొన్ని యాక్షన్స్ సీన్స్ తో పాటు సాంగ్ లో కూడా కనిపించబోతున్నారు. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ లపై సాంగ్ ను చిత్రీకరించనున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ ను యాడ్ చేయబోతున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ పూరి జగన్నాథ్ ‘గాడ్ ఫాదర్’ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు. దర్శకుడిగా ఆయన చాలా బిజీగా ఉన్నారు.

‘లైగర్’ సినిమాను పూర్తి చేసిన ఆయన ‘JGM’ సినిమాను మొదలుపెట్టారు. ఇందులో కూడా విజయ్ దేవరకొండ హీరోగా కనిపించబోతున్నారు. పూరి చేతుల్లో ఎంత పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ.. అయన గెస్ట్ రోల్ లో కనిపించడానికి రెడీ అవుతున్నారు. ఈ వీకెండ్ లో హైదరాబాద్ లో జరుగుతోన్న ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ లో పూరి జాయిన్ కానున్నారు. మరి సినిమాలో ఆయన ఎలాంటి క్యారెక్టర్ లో కనిపిస్తారో చూడాలి. గతంలో పూరి తను డైరెక్ట్ చేసిన సినిమాల్లోనే తళుక్కున మెరిశారు. ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ వస్తే వద్దనుకుంటారా చెప్పండి!

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus