Nithiin: నితిన్‌ – పూరి కాంబో ఫిక్స్‌ అయ్యిందంటున్నారు. హీరోయిన్‌ ఎవరో తెలుసా?

నితిన్‌ చేతిలో ప్రస్తుతం ఎన్ని సినిమాలున్నాయి? లెక్క ప్రకారం దీనికి సమాధానం చెప్పాలంటే రెండు అని అనాలి. అయితే ‘పవర్‌ పేట’ ముచ్చట్లు ఈ మధ్య పెద్దగా వినిపించడం లేదు కాబట్టి ‘మ్యాస్ట్రో’ ఒక్కటే అని చెప్పాలి. కాబట్టి ఆ సినిమా తర్వాత నితిన్‌ ఏం చేయబోతున్నాడు అనే డౌట్‌ తప్పక వస్తుంది. ఈ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది. ప్రస్తుతం వస్తున్న పుకార్లు నిజమైతే నితిన్‌ నెక్స్ట్‌… పూరి జగన్నాథ్‌తోనే అంటున్నారు. గతంలో ‘హార్ట్‌ ఎటాక్‌’ లాంటి ఎటాక్‌ సినిమా తీసిన ఈ జోడీ… ఈసారి ఏం చేస్తుందో చూడాలి.

పూరి జగన్నాథ్ ప్రస్తుతం ‘లైగర్‌’ పనుల్లో ఉన్నాడు. అయితే కరోనా పరిస్థితుల కారణంగా సినిమా షూటింగ్‌ రెగ్యులర్‌గా వాయిదా పడుతూ వస్తోంది. ముంబయిలో షూటింగ్‌ మొదలై, నెమ్మదిగా నడుస్తున్న తరుణంలో ఇటీవల కేసులు పెరగడంతో మళ్లీ చిత్రీకరణ వాయిదా వేశారు. దీంతో పూరి హైదరాబాద్‌ వచ్చేశాడు. ఈ క్రమంలోనే నితిన్‌కు కథ చెప్పి ఓకే చేసుకున్నాడని టాక్‌. ‘లైగర్‌’ అవ్వగానే ఈ సినిమా పట్టాలెక్కుతుందట. ఈలోగా నితిన్‌ ‘మ్యాస్ట్రో’ పూర్తి చేసేస్తాడట.

నితిన్‌ – పూరి సినిమాకు సంబంధించి మరో వార్త కూడా హల్‌చల్‌ చేస్తోంది. ఈ సినిమాలో ‘ఉప్పెన’ బేబమ్మ కృతి శెట్టి కథానాయికగా నటించనుందట. దీనికి సంబంధించి ఇప్పటికే కృతితో కథ మాటలు, మూటల మాటలు కూడా జరిగిపోయాయట. త్వరలో సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన, ముహూర్తం షాట్‌ కూడా ఉంటుంది అంటున్నారు. మరి ‘హార్ట్‌ ఎటాక్‌’ ఫలితాన్ని మరపిస్తూ పూరి ఈసారి నితిన్‌ను ఎలా చూపిస్తాడో?

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus