Chiranjeevi,Puri Jagannadh: మెగాస్టార్ మూవీలో పూరీ అలాంటి పాత్రలో కనిపిస్తారా?

మోహన్ రాజా డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గాడ్ ఫాదర్ టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. గాడ్ ఫాదర్ టీజర్ కు పది మిలియన్ల కంటే ఎక్కువగా వ్యూస్ వచ్చాయి. చిరంజీవి ఖాతాలో ఈ సినిమాతో సక్సెస్ చేరడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అయితే దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. గాడ్ ఫాదర్ సినిమాలో తాను జర్నలిస్ట్ గా కనిపిస్తానని పూరీ జగన్నాథ్ ఒక సందర్భంలో వెల్లడించారు. దర్శకుడు అయిన పూరీ జగన్నాథ్ పలు సినిమాలలో కనిపించినా ఆ సినిమాలకు పూరీ జగన్నాథ్ డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్ సినిమాకు పూరీ జగన్నాథ్ డైరెక్టర్ కాకపోయినా చిరంజీవి కోరిక మేరకు ఈ సినిమాలో నటించారు.

చిరంజీవి పూరీ జగన్నాథ్ కాంబో సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గాడ్ ఫాదర్ మూవీ షూటింగ్ పూర్తి కాగా అక్టోబర్ నెల 5వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. చిరంజీవికి జోడీగా సైరా సినిమాలో నటించిన నయనతార ఈ సినిమాలో చిరంజీవికి సోదరిగా కనిపించనున్నారు. నయనతార ఈ సినిమా కోసం రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేశారని తెలుస్తోంది.

ఆచార్య సినిమా ఫలితం షాకిచ్చినా గాడ్ ఫాదర్ సక్సెస్ తో చిరంజీవి తనపై వ్యక్తమవుతున్న విమర్శలకు చెక్ పెడతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా కోసం చిరంజీవి 40 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారు. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో చిరంజీవి మాత్రమే కావడం గమనార్హం.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus