Puri Jagannadh: పెళ్లి,విడాకుల పై సంచలన కామెంట్లు చేసిన పూరి..!

ఏ విషయం పై అయినా సరే ముక్కు సూటిగా మాట్లాడే పూరి జగన్నాథ్.. ఇటీవల కాలంలో పూరి మ్యూజింగ్స్ ద్వారా త‌న మ‌న‌సులో ఉన్న భావాలను భయటపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఒక్కోసారి ఇవి వివాదాలకు కూడా దారి తీస్తున్నాయి. మొన్నామధ్య రేషన్ కార్డు, ఓటు హక్కు గురించి పూరి చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపాయి. అయినప్పటికీ పూరి వెనకడుగు వేయడం లేదు. ఇదిలా ఉండగా.. తాజాగా పూరి జ‌గన్నాథ్.. పెళ్లి, విడాకుల‌ అంశాల పై తనదైన శైలిలో స్పందించాడు!

ముఖ్యంగా ఈ లాక్ డౌన్ టైంలో భార్య భర్తలు ఎలా ఉంటున్నారు.. వారి మధ్య బంధం ఎలా ఉంది? అనే విషయాలపై కూడా స్పందించారు. పూరి మాట్లాడుతూ.. “పెద్ద పెద్ద కోరికలు, ఫ్రీడమ్ వంటివి విడాకుల‌కు కార‌ణ‌మ‌వుతాయి. మెయిన్ గా ఈ పేండ‌మిక్ సిట్యుయేష‌న్ లో ఎక్కువ శాతం భార్య భర్తలు కలిసుంటున్నారు.ఇద్దరు కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. దీంతో వారికి మరింతగా ఎక్స్ పెక్టేషన్స్ పెరిగి విడాల‌కుల తీసుకునే వరకు వెళ్తున్నాయి. పెళ్ళి అనేదానికి కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం.

ఓ అమ్మాయి,అబ్బాయి కనీసం రెండేళ్ల పాటు ఒకర్ని ఒకరు అర్ధం చేసుకుని పెళ్లి చేసుకోవాలి. సొసైటీలో విడాకుల‌కు ఉన్న‌ట్టుగానే పెళ్ళికి కూడా స‌రైన లీగ‌ల్ ప్రాసెస్ అనేది ఉండాలి. ఒంట‌రిగా ఉన్నాం కదా అని పెళ్ళి చేసుకుంటే…. ఇక అంతే..! వైఫ్ అండ్ హజ్బెండ్ నిజానికి అర‌గంటకి మించి మాట్లాడుకోలేరు. కాబట్టి అబ్బాయిలు ఎక్కువగా త‌న స్నేహితుల‌తో క‌బుర్లు చెబుతూ, టీవీ, వాట్స్ అప్ చూస్తూ టైమ్ పాస్ చేయడం మంచిది. అప్పుడే మ్యారీడ్ లైఫ్ ను సక్సెస్ ఫుల్ గా లీడ్ చెయ్యగల” అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus