దర్శకుడు పూరి జగన్నాధ్ కు యూత్ లో ఉన్న క్రేజే వేరు. ఆయన సినిమాల్లో డైలాగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంటాయి. ‘బిజినెస్ మ్యాన్’ లాంటి సినిమాల్లో ఆయన రాసిన డైలాగ్స్ ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. ఆ తరువాత ఆయన సినిమాలకు క్రేజ్ తగ్గింది. రీసెంట్ గా ‘లైగర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రిలీజ్ కు ముందు ఈ సినిమాపై మంచి బజ్ ఉండేది. కానీ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ఇదిలా ఉండగా.. ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పాడ్ కాస్ట్ లో పూరి చెప్పిన జీవిత పాఠాలు చాలా మందిని టచ్ చేశాయి. ఒకప్పటి పూర్తి సినిమాలకు మించిన మంచి కంటెంట్ వాటిలో కనిపించింది. ‘లైగర్’ సినిమా సమయంలో ఈ పాడ్ కాస్ట్ లకు కొంత గ్యాప్ ఇచ్చిన పూరి.. ఇటీవలే వాటిని మళ్లీ మొదలుపెట్టారు. రీఎంట్రీ తరువాత ‘తడ్కా అనే కాన్సెప్ట్ మీద ఇంట్రెస్టింగ్ కామెంట్రీ ఇచ్చారు పూరి. ఇప్పుడేమో ‘గుడ్ సిటిజన్’ అనే వెరైటీ కాన్సెప్ట్ తో అభిమానుల ముందుకొచ్చారు.
దాని గురించి పూరి తనదైన శైలిలో విశ్లేషణ చేస్తూ.. ప్రభుత్వానికి ఒక సజెషన్ ఇచ్చారు. సమాజంలో బాధ్యతాయుతంగా మెలుగుతూ.. మంచి పనులు చేసేవారిని, అందరికీ సాయపడేవారిని గుర్తించి ప్రభుత్వం వారికి ‘గుడ్ సిటిజన్’ కార్డులు ఇవ్వాలనిఅన్నారు . ఈ ప్రక్రియ జెన్యూన్ గా సాగాలని చెప్పాలి. దీనికోసం ఒక వ్యవస్థ ఉండాలి. ఇలా ‘గుడ్ సిటిజన్’ గుర్తింపు పొందిన వారికి బస్సులు, రైళ్లలో రాయితీలు.. పన్ను మినహాయింపులు ఇవ్వాలి.
అలాగే వారి పిల్లలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి. ఈ ప్రాసెస్ జెన్యూన్‌గా జరిగితే ఒకరిని చూసి ఒకరు ఉత్తమ పౌరులుగా తయారవుతారని.. అప్పుడు దేశం ఎంతో బాగు పడుతుందని పూరి అభిప్రాయపడ్డాడు. తక్కువ ఖర్చుతోనే ఈ ప్రక్రియను కొనసాగించవచ్చని పూరి తెలిపారు. ఈ ఐడియా చాలా మంది నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!