Puri Jagannadh: పూరి కొత్త విషయం… విపశ్యన గురించి తెలుసా?

2500 ఏళ్ల క్రితం బుద్ధ భగవానుడు కనిపెట్టినట్టు విపశ్యన అనే పురాతన ధ్యాన పద్ధతి గురించి ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ మాట్లాడారు. చెప్పుకొచ్చారు. ‘పూరి మ్యూజింగ్స్‌’ కొత్త ఎపిసోడ్‌లో ఈ వివరాలు చెప్పారు. మనకు చాలా విపశ్యన కేంద్రాలున్నాయి. పాజిటివ్‌ ఎన్విరాన్‌మెంట్‌తో వాటిని ఏర్పాటు చేశారు. విపశ్యన అనేది ఇది అతి పురాతన బౌద్ధ ధ్యాన ప్రక్రియ. రెండు రకాలుగా ఉంటుంది. అవే ఏకాగ్రత, మనః పరిశీలన. ఇది పదిరోజుల కోర్సు. విపశ్యన చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టమని అడుగుతారు. మీ పుస్తకాలు, మొబైల్స్‌ లాంటివి తీసుకుంటారు.

ఆ తర్వాతి క్షణం నుండి ఎవరితోనూ మాట్లాడకూడదు. అక్కడ ఎంతమంది ఉన్నా, సైగల ద్వారానే సమాధానం చెప్పాలి. ఎవరి గది వాళ్లకు ఇస్తారు. ఉదయం 4 గంటలకు నిద్రలేపుతారు. 4.30 నుండి 6.30 వరకు మెడిటేషన్‌ ఉంటుంది. టిఫిన్‌ తీసుకోగానే, మళ్లీ మధ్యాహ్నం వరకు మెడిటేషన్‌ చేయాలి. ప్రతి గంటకూ ఒక తరగతి తీసుకుంటారు. స్పీకర్ల నుండి వచ్చే సూచనలు పాటిస్తూ, వాళ్లు చెప్పింది చేయడమే ఈ ప్రక్రియ. చక్కటి వెజిటేరియన్‌ ఆహారం పెడతారు. రాత్రి 9.30 గంటలకు లైట్లు ఆర్పేస్తారు. అలా రోజుకు 10 గంటలు మెడిటేషన్‌ చేయాలి.

ఈ ప్రక్రియ చేసే మొదటి రెండు రోజులు పిచ్చెక్కిపోతుంది. పారిపోవాలని అనిపిస్తుంది… కానీ గేట్లు లాక్‌ చేసేస్తారు. గోడ దూకి పారిపోవాలని చూస్తుంటారు కూడా. అందుకే అక్కడ ఎత్తైన గోడలు కడతారు. కొంతమంది తలుపులు తీయమని అరుస్తారు కూడా. అయినా వాళ్లు వినరు. ‘సైలెన్స్‌’ అని ఓ చీటీ మీద రాసిస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే మీకు జైల్లో పెట్టినట్లు ఉంటుంది. అయితే మూడో రోజు నుండి మెల్లగా అలవాటైపోతుంది. ఆ మెడిటేషన్‌లో కూర్చుంటేమీ ఒంట్లో నరనరాల్లో ప్రవహించే రక్తం శబ్దమూ వినిపిస్తుంది.

రోజూ వాగుతూ ఉండే మనలో నాన్సెన్‌ అనేది తగ్గుతూ వస్తుంది. మాట్లాడటం మానేస్తే, ఎన్ని తలనొప్పులు తగ్గుతాయో అర్థమవుతుంది. మీలో డిప్రెషన్‌, యాంగ్జైటీ లాంటివి ఉంటే తగ్గిపోతుంది. ప్రశాంతత అవర్చుకుంటారు. పది రోజుల తర్వాత మీ వస్తువులు, బట్టలు మీకు ఇచ్చేస్తూ అక్కడ ఉన్న టీచర్‌ మీకు థ్యాంక్స్‌ చెబుతారు. అన్ని రోజుల మెడిటేషన్‌ తర్వాత మీరు వినే మొదటి మాట అదే. ఆ మాట విన్న తర్వాత కృతజ్ఞతాభావంతో మీ కళ్ల నుండి నీళ్లు వచ్చేస్తాయి.

ఇక బయటకు వచ్చాక బయట ట్రాఫిక్‌ శబ్దాలు వింటే మీకు చిరాకేస్తుంది. ఇన్నాళ్లూ ఎంత శబ్ద కాలుష్యంలో బతుకుతున్నామా అనిపిస్తుంది. ఇక అప్పటి నుండి అనవసరంగా మాట్లాడరు. ఇంటికి వచ్చాక రోజుకు గంటసేపైనా మెడిటేషన్‌ చేయాలనిపిస్తుంది. కానీ కొన్ని రోజులకు అన్నీ మరచిపోయి డైలీ రొటీన్‌లోకి వచ్చేస్తారు. అంఉదకే మనలాంటి మామూలు మనుషులకు విపశ్యన పెట్టారు. ఎన్నో వేల సంవత్సరాలుగా ఈ సెంటర్లు నడుపుతున్నారు. ఈ మెడిటేషన్‌ కోర్సుకి ఫీజు తీసుకోరు. కోర్సు తర్వాత మీరు ఎంతిస్తే అంత తీసుకుంటారు. ఇవ్వకపోయినా, ఇవ్వలేకపోయినా ఏమీ అనుకోరు. అసలు ఈ కోర్సే అంత కష్టంగా ఉంటే… జీవితాంతం అక్కడే ఉండి పనిచేసే టీచర్లు, స్టాఫ్‌కు చేతులెత్తి మొక్కాలి కదా అంటూ విపశ్యన గురించి చెప్పారు పూరి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus