Pushpa 2, Anushka: అప్డేట్ బాగానే ఉంది.. ఫోటోలు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది..!
- June 26, 2024 / 12:00 PM ISTByFilmy Focus
‘పుష్ప’ (Pushpa) .. అనుష్క (Anushka Shetty) .. ఒకే చోటున ఏంటి? అనే డౌట్ హెడ్డింగ్ చూసిన తర్వాత ఎవ్వరికైనా అనుమానం రావచ్చు. అక్కడికే వచ్చేస్తున్నా..! ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) తర్వాత అనుష్క ప్రధాన పాత్రలో ‘గాటి’ అనే సినిమా రూపొందుతుంది. క్రిష్ జాగర్లమూడి Krish Jagarlamudi ఈ చిత్రానికి దర్శకుడు. సైలెంట్ గా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణ కూడా పూర్తయ్యిందట.పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) డేట్స్ ఇచ్చి..
‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యేలోపు ఈ ‘గాటి’ ని కంప్లీట్ చేసేయాలని క్రిష్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. అందువల్ల రామోజీ ఫిలింసిటీలో ఓ సెట్టు వేసి డే అండ్ నైట్ షూట్స్ చేస్తున్నారట. ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ తో.. ఈ సినిమాకు సంబంధించి అనుష్క పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోతుందట. ఆ వెంటనే ఆమె తిరిగి బెంగళూరుకి వెళ్ళిపోతుందని సమాచారం.

ఇదిలా ఉండగా.. ‘గాటి’ సినిమా షూటింగ్ జరుగుతున్న రామోజీ ఫిలిం సిటీలోనే పక్కన వేసిన మరో సెట్స్ లో ‘పుష్ప 2 ‘(Pushpa2) షూటింగ్ జరుగుతుందట. అల్లు అర్జున్ (Allu Arjun) పై కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తున్నారట. అలాగే సినిమాలోని ఐటెం సాంగ్ ను కూడా షూట్ చేయబోతున్నారట. ఈ సాంగ్ లో నోరా ఫతేహితో అల్లు అర్జున్ చిందులు వేయబోతున్నట్టు తెలుస్తుంది. ఆగస్టు 15 న రిలీజ్ కావాల్సిన ‘పుష్ప 2’ డిసెంబర్ 06 కి పోస్ట్ పోన్ అయ్యింది.












