సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) , నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం పుష్ప 2: ది రూల్ (Pushpa 2) విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, సినిమా మీద క్రేజ్ తారాస్థాయికి చేరింది. ట్రైలర్‌కి వచ్చిన అద్భుతమైన స్పందనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే యూఎస్ ప్రీమియర్ షోల ప్రీ సేల్స్‌లో మాత్రం ఈ చిత్రం ఆశించినంత జోరును చూపించలేకపోయిందని ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి. అందరూ ఊహించినట్లుగా, పుష్ప 2 ప్రీ సేల్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి.
Pushpa 2
ఇప్పటివరకు పుష్ప 2 యూఎస్ ప్రీమియర్ షో ప్రీ సేల్స్ ద్వారా $1,021,736 డాలర్ల వసూళ్లు మాత్రమే సాధించింది. కానీ, దేవర రెండు వారాల ముందు $1,040,292 డాలర్లు సాధించింది. ఈ రెండు చిత్రాల మధ్య ప్రీ సేల్స్‌లో పెద్ద తేడా లేకపోయినా, పుష్ప 2 కాస్త వెనుకబడి ఉండటం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే సమయంలో ప్రభాస్ (Prabhas) కల్కి 2898 ఏడీతో (Kalki 2898 AD) పోలిస్తే, పుష్ప 2 ప్రీ సేల్స్ గణనీయంగా మెరుగ్గానే ఉన్నాయని చెప్పాలి.
కల్కి విడుదలకు రెండు వారాల ముందు కేవలం $875K డాలర్లను మాత్రమే సాధించింది. అయినప్పటికీ, పుష్ప 2 పై ఉన్న క్రేజ్ చూసి, దీనికి మరింత క్రేజ్ అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావించారు. కానీ, ఇప్పటి వరకు ట్రెండ్ పెద్దగా ఆశాజనకంగా లేదనే మాట వినిపిస్తోంది. పుష్ప 2 విడుదలకు ముందుగా యూఎస్‌లో 500కి పైగా స్క్రీన్లలో ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు.
ఇది దేవర కన్నా ఎక్కువ స్క్రీన్లలో ప్రీమియర్స్ అయినప్పటికీ, ప్రీ సేల్స్‌లో ఆ ఉత్సాహం కొంత తగ్గిందని అంచనా వేస్తున్నారు. అయితే సినిమా విడుదలకు దగ్గరపడే కొద్దీ బుకింగ్స్ ఊహించినంతగా పెరగవచ్చని ట్రేడ్ సర్కిల్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇక విడుదల తర్వాత సినిమా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.