బన్నీ (Allu Arjun) , సుకుమార్ (Sukumar) కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ (Pushpa 2) సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బడ్జెట్ 400 కోట్లు అని 500 కోట్లు అని వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. బన్నీ ఈ సినిమా కోసం 120 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం అందుకున్నారని వార్తలు వినిపించాయి. పుష్ప2 సినిమాకు సీక్వెల్ గా పుష్ప3 మూవీ కూడా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే బిజినెస్ విషయంలో పుష్ప2 సంచలనాలు సృష్టిస్తోంది.
నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా ఈ హక్కుల కొరకు నెట్ ఫ్లిక్స్ ఏకంగా 275 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలుస్తోంది. డిజిటల్ హక్కుల విషయంలోనే ఇది రికార్డ్ అని చెప్పవచ్చు. పుష్ప ది రూల్ మూవీ హిందీ హక్కులు ఏకంగా 200 కోట్ల రూపాయల అడ్వాన్స్ కు ఇచ్చేశారని సమాచారం అందుతోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు సైతం 200 కోట్ల రూపాయలు పలికాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఓవర్సీస్, ఇతర ఏరియాల హక్కులతో కలిపి పుష్ప2 సినిమాకు 750 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఆడియో హక్కులే 60 కోట్ల రూపాయలు పలికాయని తెలుస్తోంది. పుష్ప ది రూల్ సినిమా రిలీజ్ తర్వాత ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. పుష్ప ది రూల్ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ మూవీగా నిలిచే ఛాన్స్ ఉంది.
ఈ సినిమాకు డిసెంబర్ 5వ తేదీనే ప్రీమియర్స్ కూడా ప్రదర్శించనున్నారు. పుష్ప ది రూల్ సినిమా ఇతర భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. బన్నీ మూడేళ్ల కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ సినిమాతో దక్కుతుందేమో చూడాల్సి ఉంది.