Allu Arjun Remunaration: భారీ పారితోషకం ఇవ్వడం కుదరదు.. లాభాలలో వాటా మాత్రమే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా ఏకంగా వంద కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇలా ఈ సినిమా మంచి హిట్ కొట్టడంతో ఈ సినిమా సీక్రెట్ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే పుష్ప 2సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న సుకుమార్ స్క్రిప్ట్ మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి సమయం తీసుకుంటున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు మొదలు కావాల్సి ఉండగా, స్క్రిప్ట్ పరంగా ఈ సినిమా మరి కాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.ఇక పుష్ప సినిమా మంచి విజయం కావడంతో సీక్వెల్ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి అదే విధంగా ఈ సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ ఏకంగా 350 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. ఇకపోతే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.

పుష్ప సినిమా హిట్ కావడంతో ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని గతంలో వార్తలు వచ్చాయి అయితే ప్రస్తుతం ఆయన రెమ్యూనరేషన్ మరింత పెరిగిందని ఏకంగా 125 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. రెమ్యూనరేషన్ గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఈ వార్తలపై మైత్రి మూవీ మేకర్ స్పందించారు.

ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్ స్పందిస్తూ పుష్ప సినిమా హిట్ అయిందని పుష్ప 2కి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడం కుదరదని వెల్లడించారు. ఈ సినిమాకి మొదట్లో మాట్లాడుకున్న రెమ్యూనరేషన్ తో పాటు సినిమా లాభాలలో వాటా, నామినల్ రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకోబోతున్నారు అంటూ మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది.ఇక ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులన్నీ కూడా పూర్తి అయ్యాయని త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుందని తెలిపారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus