Pushpa 2: ‘పుష్ప’ ప్రచారం.. స్టార్‌ బ్రాండ్‌లతో మైత్రీ మూవీ మేకర్స్‌ డీల్సే డీల్స్‌!

పాన్‌ ఇండియా సినిమాను తెరకెక్కించడ, నిర్మించడం ఎంత కష్టమో.. ఆ సినిమాను ప్రమోట్‌ చేసుకోవడమూ అంతే కష్టం. దేశం నలుమూలలకు, ప్రపంచంలో తెలుగువారు ఉన్న ప్రతి చోటుకు ఆ సినిమా వెళ్లాలి. దాని కోసం చాలా కష్టపడాలి, దాని కోసం చాలామందిని కలవాలి, కలుపుకోవాలి. ఇప్పుడు ‘పుష్ప’రాజ్‌ కోసం మైత్రీ మూవీ మేకర్స్‌ అదే చేస్తోంది. ఈ క్రమంలో ఐపీఎల్‌ తరహా ప్రచారం చేస్తోంది అని చెప్పొచ్చు. పాన్‌ ఇండియా సినిమా తొలి పార్టు కంటే రెండో పార్టుకు ఎక్కువ ప్రచారం అవసరం ఉండదు.

Pushpa 2

ఎందుకంటే తొలి పార్టు సినిమా కథ, టాక్‌ రెండో పార్టుకు భారీ ప్రచారం తీసుకొస్తాయి. అయితే ఊహించని విజయం, ఇండియన్‌ ఇండస్ట్రీ హిట్‌ అందుకోవాలి అంటే ఇంకా ప్రచారం కావాలి. ఎంతగా అంటే ఎక్కడ చూసినా మన సినిమానే కనిపించాలి, ఎవరు మాట్లాడినా సినిమా గురించే మాట్లాడాలి అనిపించాలి. ఇప్పుడు ‘పుష్ప: ది రూల్‌’  (Pushpa 2)  టీమ్‌ అదే చేస్తోంది. దేశంలో ప్రముఖ బ్రాండ్లతో టైఅప్‌ అయింది. వాళ్లు తమ ప్రొడక్ట్‌ల మీద ‘పుష్ప’రాజ్‌ ఫొటో ముద్రిస్తారు.

దాంతో దాదాపు ప్రత ఒక్కరి చేతిలో ‘పుష్ప’రాజ్‌ ఉంటాడు. అదెలా అనుకుంటున్నారా? మైత్రీ మూవీ మేకర్స్‌ టీమ్‌ ఆస్ట్రాల్‌, థంబ్స్‌ అప్‌, బియర్డో, కంఫర్ట్‌, కజారియా, డార్క్‌ ఫాంటసీ, దావత్‌, ఫ్రీఫైర్‌, మంగళ్‌దీప్‌, జేకే టైర్‌, టీవీఎస్‌, గ్రీన్‌ప్లై, చక్రగోల్డ్‌ లాంటి చాలా బ్రాండ్లతో కొలాబరేట్‌ అయ్యారు. ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది ‘ఫ్రీ ఫైర్‌’ గురించి. ఈ వార్‌ ఫీల్డ్‌ గేమ్‌ ఇప్పుడు మన దేశంలో యువత తెగ ఆడుతోంది. అందులోకి ‘పుష్ప’రాజ్‌ ఎంట్రీ ఇస్తున్నాడు.

దీంతో ప్రతి కుర్రాడి చేతిలో ‘పుష్ప : ది రూల్‌’ వస్తాడు. అలా సినిమా ప్రచారం భారీగా ఉండేలా చూసుకుంటోంది టీమ్‌. ఇక పాట్నా, కోల్‌కత, చెన్నై, కొచ్చి, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్‌లో ఈవెంట్లు కూడా పెడుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎలాంటి ఈవెంట్‌ లేదు. ఇది అక్కడి ఫ్యాన్స్‌కి బ్యాడ్‌ న్యూసే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus