అల్లు అర్జున్ (Allu Arjun) , సుకుమార్ (Sukumar) ..ల ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) విజయవంతంగా 25 రోజులు పూర్తి చేసుకుంది. చివర్లో క్రిస్మస్ వంటి హాలిడేస్ కలిసిరావడం వల్ల సినిమా బాగానే క్యాష్ చేసుకుంది. అయితే అది నార్త్ వంటి ఏరియాల్లో మాత్రమే.తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా స్ట్రగుల్ అవుతూనే ఉంది. సంధ్య థియేటర్ ఘటన వల్ల అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడంతో ఆడియన్స్ డైవర్ట్ అయ్యారు అని చెప్పాలి. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ‘పుష్ప 2’ బ్రేక్ ఈవెన్ సాధించలేదు.
నార్త్ లో మాత్రం ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తుంది. ఒకసారి 25 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 83.80 cr |
సీడెడ్ | 33.23 cr |
ఉత్తరాంధ్ర | 21.90 cr |
ఈస్ట్ | 11.22 cr |
వెస్ట్ | 8.93 cr |
కృష్ణా | 10.95 cr |
గుంటూరు | 12.98 cr |
నెల్లూరు | 6.82 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 189.83 cr |
కర్ణాటక | 40.60 cr |
తమిళనాడు | 12.28 cr |
కేరళ | 10.00 cr |
ఓవర్సీస్ | 102.38 cr |
నార్త్ | 320.85 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 675.94 cr (షేర్) |
‘పుష్ప 2’ చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 వారాలు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.675.94 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఈ సినిమా రూ.70.94 కోట్ల లాభాలు అందించింది ఈ సినిమా.