‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) వీకెండ్ చాలా బాగా కలెక్ట్ చేసింది. మొదటి సోమవారం అయినా కూడా కొన్ని ఏరియాల్లో మాస్ బ్యాటింగ్ చేసింది ఈ సినిమా. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమా అండర్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది అని చెప్పాలి. సోమవారం రోజున టికెట్ రేట్లు తగ్గించడం వల్ల కావచ్చు.. ఇక్కడ కొంచెం తగ్గాయి. కేరళలో అయితే చాలా తగ్గాయి అని చెప్పాలి. కానీ నార్త్ లో మాత్రం కుమ్మేస్తుంది ఈ సినిమా. బీహార్, జార్ఖండ్ వంటి ఏరియాల్లో ‘పుష్ప 2’ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది అని చెప్పాలి.
ఓవర్సీస్ లో కూడా ‘పుష్ప 2’ అదరగొట్టేస్తుంది అని చెప్పాలి. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 54.80 cr |
సీడెడ్ | 22.76 cr |
ఉత్తరాంధ్ర | 13.78 cr |
ఈస్ట్ | 7.68 cr |
వెస్ట్ | 6.40 cr |
కృష్ణా | 7.43 cr |
గుంటూరు | 10.16 cr |
నెల్లూరు | 4.60 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 127.61 cr |
కర్ణాటక | 23.97 cr |
తమిళనాడు | 6.00 cr |
కేరళ | 8.95 cr |
ఓవర్సీస్ | 65.05 cr |
నార్త్ | 147.65 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 379.23 cr (షేర్) |
‘పుష్ప 2’ చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.379.23 కోట్ల షేర్ ను రాబట్టి ఆల్ టైం రికార్డులు సృష్టించింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.225.77 కోట్ల షేర్ రావాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పెర్ఫార్మన్స్ అంతంత మాత్రంగానే ఉంది. అయితే ఈ వారం కూడా పెద్ద సినిమాలు లేవు కాబట్టి.. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులు ఎక్కువగానే ఉన్నాయి.