మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పెద్ద కూతురు సుస్మిత (Sushmita Konidela) పేరు చెప్తేనే ప్రస్తుతం మెగా ఫాన్స్ వణికి పోతున్నారు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో ఆమె డిజైన్ చేసే క్యాస్టూమ్స్ అంతగా వారిని మెప్పించకపోవడమే అని చెప్పాలి. ముఖ్యంగా చిరంజీవికి అస్సలు నప్పడం లేదు అనేది ఫ్యాన్స్ వాదన. ఫ్యాషన్ స్టైలింగ్‌లో ఆమె చాలా మంచి నైపుణ్యాలను సాధించింది కానీ సైరా (Sye Raa), గాడ్ ఫాదర్ (God Father), భోళా శంకర్ (Bhola Shankar) , ఆచార్య (Acharya) వంటి సినిమాల్లో ఆమె చిరుకి డిజైన్ చేసిన క్యాస్టూమ్స్ అభిమానులకి అంతగా నచ్చలేదు.
2017లో వచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’ (Khaidi No 150) తో ఆమె కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం మొదలుపెట్టింది. ఈ సినిమాలోని కాస్ట్యూమ్స్ చాలా బాగుంటాయి. అవన్నీ సుష్మితే డిజైన్ చేసిందని తెలిసి ఫ్యాన్స్ ప్రశంసలు కూడా కురిపించారు. కానీ ఆ తరువాత ఆమె చిరంజీవి కోసం అట్రాక్టివ్ క్యాస్టూమ్స్‌ను డిజైన్ చేయలేకపోయింది. అందువల్ల సుస్మిత కాస్ట్యూమ్ డిజైన్ పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది.
ఇప్పుడు చిరంజీవి తన కెరీర్ లో 157 వ సినిమా అనౌన్స్ చేయగా దానికి కూడా సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీన్ని శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తుండగా, నాని (Nani) ప్రజెంట్ చేస్తున్నాడు. ఫస్ట్ మూవీతోనే శ్రీకాంత్ (Srikanth Odela) బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు చిరుతో ఇంకెంత పెద్ద హిట్ సాధిస్తాడో అని అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. అంతేకాదు, టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ను ఆన్ బోర్డు చేసుకోవాలని అడుగుతున్నారు.
ఈ క్రమంలో ‘అనిరుధ్ కావాలని కాదు కాదు.. ముందు సుస్మిత అక్క వద్దని డిమాండ్ చేయండ్రా” అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జోక్ ఏంటంటే, మెగా ఫ్యాన్స్ కూడా సుస్మితను ఈ సినిమాకి తీసుకోవద్దంటూ నాని, శ్రీకాంత్ ఓదెలను కోరుతున్నారు. వింటేజ్ విలేజ్ డ్రామాగా వస్తున్న సినిమాలో మెయిన్ క్యారెక్టర్ల కాస్ట్యూమ్స్ పర్ఫెక్ట్ గా లేకపోతే మూవీ దెబ్బతింటుందని వారి అభిప్రాయం కావచ్చు. అందుకే ఈ ఒక్క మూవీకి అయినా సుస్మితని తీసేసి మంచి కాస్ట్యూమ్ డిజైనర్ ను ఎంపిక చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.