Pushpa 2 The Rule Collections: ‘పుష్ప 2’.. ఎక్స్ట్రా సీన్స్ యాడ్ చేసినా ఇక్కడ కలిసిరాలేదుగా..!

అల్లు అర్జున్, (Allu Arjun) , సుకుమార్ (Sukumar)..ల ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule)  విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. క్రిస్మస్ సెలవులు వరకు బాగా క్యాష్ చేసుకున్న ఈ సినిమా ఆ తర్వాత డ్రాప్ అయ్యింది. నార్త్ లో అయితే స్టడీగానే కలెక్ట్ చేసింది.తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవుల తర్వాత 17 నిమిషాల ఫుటేజీని యాడ్ చేయడం వల్ల.. అభిమానులు థియేటర్లకు వెళ్లారు.దీంతో కొంతవరకు మళ్ళీ వసూళ్లు సాధించే ఛాన్స్ దక్కించుకుంది. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ‘పుష్ప 2’ బ్రేక్ ఈవెన్ సాధించలేదు.

Pushpa 2 The Rule Collections:

నార్త్ లో మాత్రం భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఒకసారి (Pushpa 2 The Rule) 50 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం  86.90 cr
సీడెడ్  34.89 cr
ఉత్తరాంధ్ర  22.62 cr
ఈస్ట్  11.43 cr
వెస్ట్  9.03 cr
కృష్ణా  11.13 cr
గుంటూరు  13.23 cr
నెల్లూరు  6.97 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  196.20 cr
కర్ణాటక  40.92 cr
తమిళనాడు  13.20 cr
కేరళ  10.00 cr
ఓవర్సీస్  103.07 cr
నార్త్  331.66 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  695.05 cr (షేర్)

‘పుష్ప 2’ చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 50 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ.695.05 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా ఈ సినిమా రూ.95.05 కోట్ల లాభాలు అందించింది.

 ‘సంక్రాంతికి వస్తున్నాం’ .. ‘రంగస్థలం’ రికార్డుకి ఎసరు పెట్టింది..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus