Pushpa 2 The Rule Review: ‘పుష్ప 2’.. ‘పుష్ప’కి 10 రెట్లు .. తగ్గేదే లేదట..!

  • November 24, 2024 / 05:06 PM IST

సినీ ప్రేక్షకులంతా ‘పుష్ప 2’ ఫీవర్ తో ఉన్నారు. ఆ ఫీవర్ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పాకింది అని చెప్పాలి. గత వారం ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. దీనికి యునానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంచనాలు పది రెట్లు పెంచేసింది అని చెప్పాలి. సుకుమార్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు అలాగే ప్యాచ్ వర్కుల్లో బిజీగా ఉన్నారు. నిర్మాతలు ప్రమోషనల్ ప్లాన్స్ వేసుకుంటున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో కూడా పలు ప్రెస్-మీట్లు ఈవెంట్..లు ప్లాన్ చేశారు. వీటి హడావిడితో ఒక పక్క చిత్ర బృందం బిజీగా ఉంటే..

Pushpa 2 The Rule

మరోపక్క ‘పుష్ప 2’ డిసెంబర్ 5 కి రావడం లేదు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దీనికి వెంటనే చిత్ర బృందం క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎట్టిపరిస్థితుల్లోనూ డిసెంబర్ 5 నే ‘పుష్ప 2’ రిలీజ్ అవుతుందని.. డిసెంబర్ 4 నే షోలు పడతాయని… ఈ విషయాల్లో తగ్గేదే లేదని చిత్ర బృందం తెలిపింది. ఇదిలా ఉండగా.. ‘పుష్ప 2’ ని సుకుమార్ కొంతమంది సినీ ప్రముఖులకు చూపించడం జరిగింది. వాళ్ళు అంతా కూడా పాజిటివ్ రెస్పాన్స్ చెబుతున్నారు.

* ‘పుష్ప 2’ స్టార్టింగ్ లో ‘పుష్ప'(ది రైజ్) కి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలకి సంబంధించిన క్లిప్పింగ్స్ వేస్తారట.

*అలాగే కొంత సస్పెన్స్ తో సెకండ్ పార్ట్ కథ మొదలవుతుందని.. ఆ టైంలో బన్వర్ సింగ్ షెకావత్ తో పుష్ప..లకి మధ్య జరిగిన పోరుకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూపిస్తారని తెలుస్తోంది.

*ఆ ఫ్లాష్ బ్యాక్ టైంలోనే ‘పుష్ప’ ని వెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ (అజయ్.. అండ్ కో) కొన్ని ఇబ్బందులు పెడతారట. వాళ్ళని ‘పుష్ప’ ఆదుకోవడం జరుగుతుందట. అక్కడ వచ్చే కొన్ని సీన్స్ లో ఎమోషన్ బాగా పండిందట. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వాటికి బాగా కనెక్ట్ అవుతారని అంటున్నారు.

* అటు తర్వాత పుష్ప ఫ్యామిలీని షెకావత్ టార్గెట్ చేసి వేధిస్తాడట. ఈ క్రమంలో పుష్ప చనిపోయినట్టు ప్రోజెక్ట్ చేస్తారని అంటున్నారు. ట్రైలర్లో స్మశానంలో వచ్చే విజువల్ కూడా దానికి సంబంధించిన అంటున్నారు.

* ఇక జాతర సీక్వెన్స్ సినిమాలో 15 నిమిషాల పాటు ఉంటుందట. ఈ క్రమంలో వచ్చే ఒక ఫైట్ 5 నిమిషాల వరకు ఉంటుందని.. సినిమాలో ఇది హైలెట్ అవుతుందని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సీక్వెన్స్ కి హైలెట్ అని అంటున్నారు.

* సెకండాఫ్ లో కొంత భాగం చైనా బ్యాక్ డ్రాప్ తో ఉంటుందట. అందుకే ‘పుష్ప నేషనల్ కాదు ఇంటర్నేషనల్’ అనే డైలాగ్ పెట్టినట్టు వినికిడి.

* అలాగే రావు రమేష్, సునీల్, అనసూయ, డాలి ధనుంజయ..ల పాత్రలు కూడా కీలకంగా ఉంటాయని తెలుస్తోంది.

మొత్తంగా ‘పుష్ప 2’ .. మొదటి భాగం(‘పుష్ప) కంటే 10 రెట్లు ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి డిసెంబర్ 4న ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో..!

కొత్త సినిమాలు వచ్చాయి.. బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus