Pushpa 2 The Rule: 46 ఏళ్ళ తరువాత.. పుష్ప 2 బిగ్ రికార్డ్!

పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2: The Rule)  ఒకటి. అల్లు అర్జున్ (Allu Arjun)   ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన రన్‌టైమ్ హాట్ టాపిక్‌గా మారింది. లేటెస్ట్ టాక్ ప్రకారం, ‘పుష్ప 2’ రన్‌టైమ్ 3 గంటల 21 నిమిషాలు ఉండనుందని తెలుస్తోంది. ఇది తెలుగులో గతంలో వచ్చిన పెద్ద సినిమాల కంటే ఎక్కువగా ఉండటమే కాకుండా, ఇండియన్ సినీ చరిత్రలో మరచిపోలేని స్థాయిలో నిలిచేలా చేస్తోంది.

Pushpa 2 The Rule

ఈ రన్‌టైమ్ 46 ఏళ్ల క్రితం విడుదలైన ఎన్టీఆర్ లెజెండరీ చిత్రం ‘దాన వీర శూర కర్ణ’ (3 గంటల 46 నిమిషాలు) తర్వాత లాంగ్ రన్ టైమ్ ఉన్న చిత్రంగా నిలవనుంది. ఆ తర్వాత ఇంత పెద్ద రన్‌టైమ్ ఉండే చిత్రం రావడం సినిమా లవర్స్ కు ఒక ప్రత్యేక అనుభవం. అంతేకాక, ‘లవకుశ’ (3 గంటల 28 నిమిషాలు) – ‘సంపూర్ణ రామాయణం’ (3 గంటల 24 నిమిషాలు) తరహాలోనే ‘పుష్ప 2’ కూడా ఆ స్థాయి క్లాసిక్స్ లిస్టులో చేరబోతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సుకుమార్ (Sukumar) ఈ చిత్రాన్ని అద్భుతమైన ఎమోషనల్ డ్రామాతో పాటు యాక్షన్ ప్యాక్డ్ ఎలిమెంట్లతో డిజైన్ చేశారని సమాచారం. మొదటి భాగం సృష్టించిన మేజిక్‌ను కొనసాగించడమే కాకుండా, మరింత హై లెవెల్లో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారట. ముఖ్యంగా, ఇంటర్వెల్ తరువాత చిత్ర కథనం పూర్తిగా యాక్షన్ ఘట్టాలతో నడుస్తుందని, ప్రతీ సన్నివేశం అద్భుతంగా ఉంటుందని టాక్. దీని వల్ల ‘పుష్ప 2’ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ మరింత రిచ్ గా ఉంటుందని చెబుతున్నారు.

ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్, ఐటెం సాంగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. రన్‌టైమ్ ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రేక్షకుల కిక్కును, ఆసక్తిని తగ్గించకూడదనేలా ప్రతీ క్షణం ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు. విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ క్రేజ్ నమోదవుతోంది. దీని ద్వారా బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

చైతన్య – శోభిత పెళ్లి పనులు షురూ.. ఫొటోలు వైరల్‌.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus