Pushpa 3: అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్ చెప్పిన ఫహాద్ ఫాజిల్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా చేసిన మూవీ ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఘనవిజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. డివైడ్ టాక్ తో మొదలైన ఈ చిత్రం జర్నీ… బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టికెట్ రేట్ల ఇష్యు అనేది ఆ టైంలో లేకపోతే ఈ మూవీ ఇంకా బాగా కలెక్ట్ చేసి ఉండేది అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రాలో పలు ఏరియాల్లో తప్ప.. మిగిలిన చోట్ల సక్సెస్ అందుకుంది.

ఇక తమిళ్, మలయాళం, హిందీ అన్ని భాషల్లోనూ సూపర్ సక్సెస్ సాధించి అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ గా చేసింది. ఇక రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ పార్ట్ 1 ‘పుష్ప ది రైజ్’ లో పుష్ప రాజ్ ఎర్రచందం సిండికేటర్ గా మారడం.. అతనికి పెళ్లవడం, శిఖావత్ తో శత్రుత్వం మొదలవ్వడం వంటివి చూపించారు. పార్ట్ 2 అయిన ‘పుష్ప ది రూల్’ లో అతను శిఖావత్ తో చేసిన యుద్దాన్ని అలాగే చైనా బ్యాక్ డ్రాప్ లో కొంత భాగం నడుస్తుంది అని స్పష్టమవుతుంది.

దీనికి పార్ట్ 3 కూడా ఉండబోతుంది అని క్లారిటీ వచ్చింది. ఈ విషయాన్ని ‘పుష్ప ది రూల్’ లో విలన్ పాత్ర పోషిస్తున్న ఫహాద్ ఫాజిల్ తెలియజేశాడు. ‘రీసెంట్ గా సుకుమార్ గారు ఫోన్ చేసి పుష్ప మూడో భాగం కూడా ఉండొచ్చు అని అందుకు తగ్గట్టు పాయింట్ కూడా అనుకున్నట్లు చెప్పారు. ఆయన(సుకుమార్) కాన్ఫిడెంట్ గా చెప్పలేదు కానీ ‘పుష్ప 3′ ఉండే అవకాశం ఉందని అర్ధమవుతుంది’ అంటూ అతను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే ‘పార్ట్ 3’ రావాలి అంటే ‘పార్ట్ 2’ కూడా హిట్ అవ్వాలి మరి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus