పుష్ప సినిమాలో కేశవా పాత్రలో చిత్తూరు యాసలో మాట్లాడుతూ ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి నటుడు జగదీష్ అనే నటుడిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఒక యువతి ఆత్మహత్య కేసులో భాగంగా ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈయనని అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 6న జగదీష్‌ను అరెస్ట్ చేశారు. అదే రోజు నాంపల్లి కోర్టులో హాజరుపరిచగా న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఈయన చంచల్ గూడ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
జైలులో ఉన్నటువంటి ఈయనను విచారించడం కోసం రెండు రోజుల రిమాండ్ కోరగా కోర్టు అనుమతించింది. తాజాగా జగదీష్‌ను పంజాగుట్ట పోలీసులు విచారించారు. ఈ పోలీసుల విచారణలో భాగంగా జగదీష్ నేరం అంగీకరించారు. ఆత్మహత్య చేసుకుని మరణించిన అమ్మాయి తనతో చాలా చనువుగా ఉండి తనకు బాగా దగ్గరయింది. ఇలా తనకు దగ్గర అయినటువంటి ఆ అమ్మాయి మరొకరికి దగ్గర కావడం నేను భరించలేకపోయాను అందుకే తనని దారిలోకి తెచ్చుకోవడం కోసమే బెదిరించానని జగదీష్ తెలిపారు.
ఇలా ఆమెను దారిలోకి తెచ్చుకోవడం కోసమే తాను బెదిరించాను తప్ప ఆమె ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని అసలు ఊహించలేదని జగదీష్ పోలీసుల విచారణలో తెలిపారు. ఏది ఏమైనా పుష్ప సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ఒక అమ్మాయి విషయంలో ఇలా జైలు పాలు కావడంతో అందరూ షాక్ అయ్యారు.
ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నటువంటి ఇత (Jagadeesh)ను బెయిల్ మీద బయటకు వస్తారా వచ్చి పుష్ప సినిమాలో పాల్గొంటారా ఈయన బయటకు వచ్చేవరకు చిత్ర బృందం ఎదురు చూస్తారా లేక ఈయన స్థానంలో మరెవరినైనా తీసుకుంటారా అనే విషయాల గురించి పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్
‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!