Pushpa First Single: ‘పుష్ప’ అప్‌డేట్‌ అంటూ వెరైటీ ట్వీట్‌ వచ్చిందేంటో!

Ad not loaded.

అల్లు అర్జున్‌ – సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ‘అల వైకుంఠపురములో’ టైమ్‌లోనే ఈ అనౌన్స్‌మెంట్‌ జరిగింది. అప్పుడు అల్లు అర్జున్‌, చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్‌ అకౌంట్స్‌లో కొన్ని ట్వీట్లు పడ్డాయి. అదేదో సాధారణమైన ట్వీట్లు అనుకొని అందరూ వదిలేశారు. కానీ అందులో సినిమా పేరు ఉందని… టైటిల్‌ను అనౌన్స్‌ చేశాక తెలిసింది. ఇప్పుడు మరోసారి చిత్రబృందం అలాంటి వెరైటీ ట్వీట్‌ను వేసింది.

అది కూడా నిన్న రాత్రి 10 తర్వాత. అందులో పులి, మేక ఎమోజీలు… తర్వాత పుష్ప అనే పేరు ఆఖరున నిప్పు కనిపిస్తున్నాయి. ఇది ఎందుకు వేశారు, కారణమేంటి అనేది తెలియలేదు. దీంతో అభిమానులు ఏమై ఉండొచ్చా అని ఆలోచించడం మొదలుపెట్టారు. అక్కడికి ఓ రెండు గంటల తర్వాత రేపు (ఆగస్టు 2) దేవిశ్రీప్రసాద్‌ పుట్టిన రోజు అంటూ మరో ట్వీట్‌ వేశారు. దీంతో కొంతమంది అభిమానుల్లో క్లారిటీ వచ్చేసింది.

అదే డీఎస్పీ పుట్టిన రోజు సందర్భంగా ‘పుష్ప’కు సంబంధించిన గ్లింప్స్ వీడియోను వదలుతున్నారని. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. కానీ ఆ ట్వీట్‌లో మజా మాత్రం అదిరింది. అయితే ఇది సినిమా రిలీజ్‌ డేట్‌ను చెప్పేలా ఉంది అని కూడా కొందరు అంటున్నారు. మరి ఈ రోజు చిత్రబృందం ఏమన్నా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.


ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus