Pushpa Movie: మైత్రి నిర్మాతలు ఎంత తిరిగిస్తున్నారంటే..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప ది రైజ్’ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేశారు. తెలుగులో దాదాపు రూ.130 కోట్ల గ్రాస్ ను రాబట్టిన ఈ సినిమా హిందీలో రూ.70 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

మొత్తం అన్ని భాషల్లో కలుపుకుంటే రూ.300 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. అయితే ఏపీలో మాత్రం ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. ఎందుకంటే.. ఏపీలో టికెట్ రేట్స్ తగ్గించడమే దానికి కారణం. దీంతో ఏపీలో సినిమాను కొన్న బయ్యర్లు నష్టపోయారని సమాచారం.దీంతో చిత్ర నిర్మాణ సంస్థ నష్ట నివారణ చర్యలను తీసుకుంటున్నారట. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ఈ సినిమాను ఏపీలో రూ.60 కోట్లకు అమ్మారట. కానీ ఆ స్థాయిలో లాభాలు రాలేదు.

దీంతో ఆంధ్రప్రదేశ్ లో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయాయి మొత్తం నుంచి యాభై శాతాన్ని నిర్మాతలు తిరిగి ఇస్తున్నారట. ఇది నిజంగా అభినందించాల్సిన విషయం. మరికొన్ని రోజుల్లో ‘పుష్ప’ సినిమా సెకండ్ పార్ట్ ను మొదలుపెట్టనున్నారు. ముందుగా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేయాలనుకున్నారు కానీ కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి పరిస్థితులు కంట్రోల్ లోకి వచ్చిన తరువాత రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus