అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 3వ చిత్రం ‘పుష్ప’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ పేరుతో పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 17న విడుదల అయ్యింది. ‘ముత్తంశెట్టి మీడియా’ సంస్థతో కలిసి ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. టాక్ తో సంబంధం లేకుండా ఈ చిత్రం మంచి కల్లెక్షన్లని రాబట్టింది.
ఇప్పటికీ రాబడుతూనే ఉంది కూడా..! నిన్నటితో ఈ చిత్రం ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయ్యింది. ‘పుష్ప’ 18 రోజుల కలెక్షన్లను ఓసారి గమనిస్తే :
నైజాం
36.60 cr
సీడెడ్
14.06 cr
ఉత్తరాంధ్ర
7.83 cr
ఈస్ట్
4.87 cr
వెస్ట్
4.04 cr
గుంటూరు
5.25 cr
కృష్ణా
4.14 cr
నెల్లూరు
3.06 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
79.85 cr
తమిళ్ నాడు
10.00 cr
కేరళ
4.95 cr
కర్ణాటక
10.25 cr
రెస్ట్
29.00 cr
ఓవర్సీస్
12.35 cr
టోటల్ వరల్డ్ వైడ్
146.40 cr
‘పుష్ప ది రైజ్’ కి అన్ని వెర్షన్ లు కలుపుకుని రూ.145.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.146 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 18 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.146.40 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ పూర్తయినట్టే.! తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒక్క తెలంగాణలోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ ను సాధించింది. ఆంధ్రలో మాత్రం భారీ నష్టాలనే మిగిల్చింది. టికెట్ రేట్ల ఇష్యు కారణంగానే ఇక్కడ బ్రేక్ ఈవెన్ కాలేదని స్పష్టమవుతుంది.