2021 ఎండింగ్ లో రిలీజ్ అయిన అల్లు అర్జున్- సుకుమార్ ల ‘పుష్ప’.. ఆ ఏడాదికి బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం సక్సెస్ సాధించింది. ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో ఈ చిత్రం డిజిటల్ రిలీజ్ అవ్వడం కూడా జరిగింది. ఇక్కడ కూడా ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. అల్లు అర్జున్, రష్మిక లతో పాటు ఇందులో నటించిన నటీనటులందరికీ మంచి అప్లాజ్ లభిస్తుంది.
ముఖ్యంగా హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన అనష్వి రెడ్డి పాత్ర అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. ఈమె ఎవరు ఏంటి? ఇంతకు ముందు ఏ సినిమాల్లో నటించింది అనే విషయాలు తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఈమె ఫిల్మీ ఫోకస్ తో ముచ్చటించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చింది. ఆ విశేషాలు మీ కోసం
ప్ర. మీ గురించి తెలుసుకోవాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు? వాళ్ళ గురించి మీ నేటివ్ ప్లేస్ అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పండి..?
జ.నా పేరు అనష్వి.. అందరికీ తెలిసిందే ! నాకు సినిమా బ్యాక్ గ్రౌండ్ అంటూ ఏమీ లేదు. మా నేటివ్ ప్లేస్ తిరుపతి. నేను ఎం.బి.ఎ పూర్తిచేశాను.తిరుపతిలోనే నా ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేశాను.అక్కడ మ్యూజిక్ కాలేజ్ లో కూడా జాయిన్ అయ్యి ఒక సంవత్సరం కోర్స్ చేశాను.అటు తర్వాత జాబ్ పర్పస్ బెంగుళూర్ వెళ్ళడం అక్కడ ఒక సంవత్సరం జాబ్ చేయడం జరిగింది. ఐటీ సెక్టార్ లో నేను జాబ్ చేశాను. మా నాన్న గారు ఫార్మింగ్ అండ్ రియల్ ఎస్టేట్ కూడా చేస్తారు. నాకు ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఉన్నారు.నేనే పెద్దమ్మాయిని…! మా అమ్మకి నేను సినిమాల్లోకి వెళ్తాను అంటే వద్దనే వారు. కానీ ఫైనల్ గా ఒప్పించి ఈ మూవీలో చేశాను.
ప్ర.’పుష్ప’ నే మీ మొదటి సినిమానా? ముందు ఏమైనా చేసారా?
జ.’పుష్ప’ నే నా మొదటి సినిమా. ‘పుష్ప’ సినిమాకి కాల్ వచ్చేవరకు కూడా నేను ఈ సినిమాలో సెలక్ట్ అవుతాను అని అనుకోలేదు. కానీ బాగా ఆడిషన్ ఇచ్చాను అనే ఫీలింగ్ ‘పుష్ప’ కలిగించింది.
ప్ర.’పుష్ప’ లో మీరు రష్మిక గారికి చిత్తూర్ స్లాంగ్ నేర్పించారట నిజమేనా?
జ.అవును.. నేను షూటింగ్లో పాల్గొనడానికి ముందే రష్మిక గారికి చిత్తూర్ స్లాంగ్ నేర్పించడం మొదలుపెట్టాను. ఆవిడ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ షూటింగ్లో పాల్గొంటున్నప్పుడు కూడా నేను ఆ సెట్స్ కి వెళ్లి మరీ ఆమెకి స్లాంగ్ నేర్పించాను.
ప్ర.’పుష్ప’ లో మీ పాత్రకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేసారా?
జ.సినిమాలో నా పాత్రకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అని నేను అనుకోలేదు. ఎందుకంటే సుకుమార్ సర్.. స్క్రిప్ట్ ముందు వినిపించినప్పుడు కంటే షూటింగ్ స్పాట్లో మళ్ళీ దాన్ని వేరేలా మార్చేస్తారు. ఆయన మైండ్లో కొత్త కొత్త థాట్స్ అప్డేట్ అవుతూనే ఉంటాయి. ఫైనల్ గా అయితే నా రోల్ ను బాగా డిజైన్ చేశారు.అది షూటింగ్ చేసాక మాత్రమే తెలిసింది. మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు హ్యాపీగా ఉంది.
ప్ర. ‘పుష్ప’ లో మీ పాత్రకి ఏమైనా హోమ్ వర్క్ చేసారా?
జ.నిజానికి నేను మరీ అంత చబ్బీగా ఉండను. ఈ మూవీ కోసం ఇంకాస్త వెయిట్ పెరిగాను. బ్రిడ్జి సీన్ కి ఫస్ట్ మంచి అప్లాజ్ వచ్చింది.
ప్ర.టిఫిన్ డైలాగ్ సీన్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది కదా?
జ.అవును టిఫిన్ సీన్ కూడా బాగా వచ్చింది. ఆ సీన్ షూటింగ్ చేస్తున్నప్పుడు మెహర్ రమేష్ గారు వి.వి.వినాయక్ గారు కూడా వచ్చారు. సుకుమార్ గారిని సర్ ప్రైజ్ చేయడానికి వాళ్ళు వచ్చారట.అది నా లక్ అనుకోవాలి..అక్కడ ఆ పెర్ఫార్మన్స్ చూసాక ‘బాగా చేసావ్ అమ్మా’ అని వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేశారు.
ప్ర. అల్లు అర్జున్ గారి గురించి చెప్పండి?
జ. సార్ అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తారు. చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అనే తేడా చూపించరు. అందరినీ అమ్మ అమ్మ అంటూ చాలా జోవియల్ గా ఉంటారు.
ప్ర. ‘పుష్ప2’ లో మీ పాత్ర ఉంటుందా?
జ.’పుష్ప2′ లో నేను ఉన్నానో లేదో ఇంకా నాకు తెలీదు. కానీ రష్మిక గారికి స్లాంగ్ నేర్పించడానికి నేను షూటింగ్ కు వెళ్ళాలి. షూటింగ్ స్టార్ట్ అయ్యి కాల్ వచ్చే వరకు తెలీదు.
ప్ర.’పుష్ప’కి మీ రెమ్యూనరేషన్ ఎంత?
జ.ఈ సినిమాకి నాకు మంచి రెమ్యూనరేషనే ఇచ్చారు. యాక్టింగ్ కు సెపరేట్ గా.. స్లాంగ్ నేర్పించడానికి సెపరేట్ గా నేను శాటిస్ఫై అయ్యేలానే ఇచ్చారు.
ప్ర. నెక్స్ట్ ప్రాజెక్టులు ఏమైనా ఓకె అయ్యాయా?
జ.నాకు కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ‘పుష్ప’ లా మంచి పేరు తెచ్చిపెట్టే పాత్రలే చెయ్యాలని డిసైడ్ అయ్యాను. డబ్బు కోసం ఏ పాత్రలు పడితే ఆ పాత్రలు చెయ్యను.