Pushpa Review: ‘పుష్ప’ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.!

‘పుష్ప ది రైజ్’… సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందిన మొదటి పాన్ ఇండియా చిత్రం. అలాగే అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన 3వ చిత్రం. ‘ముత్తంశెట్టి’ మీడియా సంస్థతో కలిసి ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. వకీల్ సాబ్, అఖండ ల తర్వాత రాబోతున్న పెద్ద చిత్రం కావడం.. టీజర్, ట్రైలర్లు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో సినిమా పై అంచనాలు పెరిగాయి.

డిసెంబర్ 17న అంటే మరో రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమర్ సంధు ఈ చిత్రాన్ని వీక్షించి రివ్యూని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. అతని రివ్యూ ప్రకారం… పుష్ప మొదటి సగం రేసీ అండ్ టెర్రిఫిక్ గా ఉంటుందట. ఈ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ లారీ డ్రైవర్ గా మాస్ లుక్‌లో న్యూ అవతార్ లో అదరగొట్టాడట.

రష్మిక మందన గ్లామర్ కూడా సూపర్ అని ఈ చిత్రంతో ఆమె మరో హిట్టుని తన ఖాతాలో వేసుకుని సూపర్ ఫామ్ ను కొనసాగిస్తుంది అని చెప్పుకొచ్చాడు.సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో అదరగొట్టారని..తెలిపాడు. ఇంటర్వెల్ వద్ద వచ్చే ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉందని దేవి శ్రీ అందించిన నేపధ్య సంగీతం కూడా టాప్ నాచ్ అనే విధంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఫస్ట్ హాఫ్ సూపర్ అని చెప్పుకొచ్చిన ఉమర్ సెకండ్ హాఫ్ అయితే అద్భుతం అని కితాబిచ్చాడు.

కెమెరా వర్క్, ఫైట్స్, అల్లు అర్జున్ – రష్మిక ల కెమిస్ట్రీ క్లైమాక్స్ అద్భుతంగా ఉన్నాయట. అల్లు అర్జున్ కు ఈ చిత్రంతో నేషనల్ అవార్డ్ రావడం గ్యారెంటీ అని కూడా అతను ధీమా వ్యక్తం చేశాడు. సుకుమార్ టేకింగ్ కూడా చాలా ఎంగేజింగ్ గా ఉందని ఉమర్ చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఇది పండుగ లాంటి సినిమా అని ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందని ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేశాడు.

ఇతని రివ్యూల పై అవగాహన ఉన్న వారు.. పెద్దగా పట్టించుకోరు కానీ బన్నీ అభిమానులు మాత్రం అల్లు అర్జున్ సూపర్ హిట్టు కొట్టేశాడని పొంగిపోతున్నారు. గతంలో సర్ధార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం,స్పైడర్,అజ్ఞాతవాసి, సాహో వంటి చిత్రాలకి ఇతను ఇచ్చిన రివ్యూలని కూడా వాళ్ళు గుర్తుచేసుకుంటే ఎక్కువ ఆశలు పెట్టుకోరనే చెప్పాలి.

1

2

3

4

5

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus