Pushpa Movie: పుష్ప అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలోనే సర్‌ప్రైజ్‌!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్టులలో పుష్ప ఒకటి. రోజురోజుకు ఈ మూవీపై అంచనాలు గట్టిగానే పెరుగుతున్నాయి. దర్శకుడు సుకుమార్ టీజర్ తోనే ఒక్కసారిగా బజ్ క్రియేట్ చేయడంతో సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ కరోనా వలన సినిమాను మరికొన్ని నెలలు వాయిదా వేయక తప్పేలా లేదు. అసలైతే ఆగస్ట్ 13న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు అప్పటి వరకు అనుకూలంగా ఉంటాయా లేదా అనేది అనుమానంగానే ఉంది.

గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త ఊర మాస్ లుక్కుతో కనిపిస్తున్న బన్నీ ఎప్పుడు వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్టు కొట్టేలా ఉన్నాడని అనిపిస్తోంది. అందుకే రిలీజ్ విషయంలో నిర్మాతలు ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ఇక ఫస్ట్ సాంగ్ ను కూడా విడుదల చేయాలని అనుకుంటున్నారట. టీజర్ అనంతరం సినిమాకు సంబంధించిన మరో సర్‌ప్రైజ్‌ ఏమి రాలేదు. కరోనా సెకండ్ వేవ్ రావడం వలన షూటింగ్ షెడ్యూల్ క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే.

ఇక మొత్తానికి జూన్ 5 నుంచి మరొక షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నారు. అదే విదంగా ఫస్ట్ సాంగ్ కూడా విడుదల చేసి సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. మరి సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఎలాంటి ట్యూన్ తో ఆకట్టుకుంటాడో చూడాలి. రష్మీక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus