Srivalli song: ‘పుష్ప’ సెకండ్ సింగిల్ కూడా సూపర్ హిట్టే..!

‘పుష్ప’ నుండీ రెండో పాటని విడుదల చేయబోతున్నట్టు గత వారం పది రోజులుగా చర్చ జరుగుతుంది. అక్టోబర్ 13న విడుదల చేస్తున్నారు అని ప్రకటించినప్పటి నుండీ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. చూపే బంగారమాయనే శ్రీవల్లి… అంటూ సాగే ఈ పాటని సిద్ శ్రీరామ్ ఆలపించినట్టు తెలియజేస్తూ ఓ ప్రోమోని కూడా విడుదల చేశారు మేకర్స్. దాంతో ఈ సాంగ్ వెంటనే వినెయ్యాలి అనే ఆసక్తి అందరిలోనూ మరింత పెరిగింది. మొత్తానికి కొద్దిసేపటి క్రితం ఈ పాటని రిలీజ్ చేశారు.

‘నిను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే’ అంటూ సాంగ్ మొదలైంది. హీరోయిన్ కి లైన్ వేస్తూ హీరోగారు పాడుకునే వన్ సైడ్ సాంగ్ ఇదని స్పష్టమవుతుంది. ‘రంగస్థలం’ లో రామలక్ష్మీ(సమంత) ని తలపించేలా… ‘ఎంత సక్కగున్నావే’ అనే పాటని కూడా గుర్తుచేసేలా ఈ పాట ఉందని చెప్పొచ్చు. ఈ పాటకి కూడా చంద్రబోస్ లిరిక్స్ అందించడం విశేషం. ‘చూపె బంగారమాయనే శ్రీవల్లి మాటే మందరామాయెనే’.. అనే లిరిక్ వచ్చినప్పుడు దేవి అందించిన ట్యూన్ కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని చెప్పొచ్చు.

పాట వినసొంపుగా ఉంది. అక్కడక్కడా బన్నీ వేసిన నేచురల్ స్టెప్పులు కొత్తగా అనిపిస్తాయి. మొత్తానికి ‘పుష్ప’ రెండో పాట కూడా బాగుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ‘పుష్ప’… మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ పేరుతో విడుదల కానుంది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!


సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus