Pushpa2: వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కి ఆ రెండు ఫ్యామిలీలు నేనంట!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి గత కొన్ని నెలలుగా ఎన్నో రూమర్లు.. ఎన్నో కథనాలు వెలువడ్డాయి. వాటన్నింటిని నిజం చేస్తూ ఈ ఆన్ స్క్రీన్ జంట రియల్ లైఫ్ కపుల్ కాబోతున్నారు. జూన్ 9న శుక్రవారం రోజు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ కి అధికారిక ప్రకటన వచ్చేసింది. దీనితో మెగా ఫ్యామిలిలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి అంతరిక్షం, మిస్టర్ చిత్రాల్లో నటించారు.

అప్పటి నుంచే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. కానీ ఎప్పుడూ వీరిద్దరూ మీడియా కంట పడలేదు. అయితే వీరిద్దరి లవ్ ఎఫైర్ మ్యాటర్ మాత్రం బయట లీక్ అయింది. కానీ ఈ వార్తలని లావణ్య త్రిపాఠి ఖండిస్తూ వచ్చింది. ఎట్టకేలకు తాను కోరుకున్న వాడితోనే ఆమె జీవితాన్ని పంచుకోబోతోంది. ఈరోజు (జూన్9) జరగబోయే నిశ్చితార్థానికి కేవలం మెగా ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ కోసం పుష్ప 2 (Pushpa2) షూటింగ్ ఓ బిజీగా ఉన్న అల్లు అర్జున్..

షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి రాబోతున్నాడట. అలాగే రాంచరణ్, చిరంజీవి కూడా హాజరవుతారు. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా మెగా ఫ్యామిలీ నుంచి అందరూ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఎంగేజ్మెంట్ పూర్తయ్యాక వివాహ తేదీని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ వివాహం గురించి గతంలోనే నాగబాబు హింట్ ఇచ్చారు. వరుణ్ పెళ్లి ఈ ఏడాదిలోనే ఉంటుంది అని తెలిపారు.

నిహారికకి కూడా లావణ్య త్రిపాఠితో మంచి పరిచయం ఉంది. వాస్తవానికి నిహారిక వల్లే.. వరుణ్, లావణ్య మధ్య మరింతగా బంధం పెరిగినట్లు రూమర్స్ ఉన్నాయ్. నిహారిక, లావణ్య తరుచుగా జిమ్ లో మీట్ అయ్యేవారట. ఇదిలా ఉండగా వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున అనే యాక్షన్ మూవీ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఆగష్టు 25న రిలీజ్ కి రెడీ అవుతోంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus