Pushpa2: ఇండస్ట్రీ వర్గాలకు షాకిస్తున్న పుష్ప2 బడ్జెట్.. ఈ రేంజ్ లో ఖర్చవుతోందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల బడ్జెట్ లెక్కలు శరవేగంగా మారిపోతున్నాయి. 15 సంవత్సరాల క్రితం మగధీర (Magadheera) సినిమాను 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించడం అప్పట్లో సంచలనం కాగా ఇప్పుడు ప్రతి పాన్ ఇండియా సినిమా 300 నుంచి 800 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. మహేష్ (Mahesh Babu) రాజమౌళి (S. S. Rajamouli) కాంబో మూవీ 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో సంచలనం సృష్టిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే పుష్ప ది రూల్ (Pushpa2) మూవీ కూడా బడ్జెట్ పరంగా ఇండస్ట్రీ వర్గాలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది.

6 నిమిషాల సీక్వెన్స్ కోసం ఏకంగా 60 కోట్ల రూపాయలు ఖర్చు చేశారనే వార్త సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తోంది. పుష్ప ది రూల్ సినిమాకు గంగమ్మ జాతర సీక్వెన్స్ హైలెట్ కానుందని ఇప్పటికే ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మేకర్స్ సైతం ఈ సీక్వెన్స్ కు సంబంధించిన అప్ డేట్స్ ఎక్కువగా ఇస్తున్నారు. ఈ సీక్వెన్స్ సినిమాలో కేవలం 6 నిమిషాలు మాత్రమే ఉంటుందని తెలుస్తోంది.

ఆరు నిమిషాల ఫుటేజ్ కోసం 60 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అంటే సాహసం అనే చెప్పాలి. సుకుమార్ (Sukumar) పుష్ప ది రూల్ పై ఏ స్థాయిలో నమ్మకం పెట్టుకున్నారో చెప్పడానికి ఈ బడ్జెట్ లెక్కలే సాక్ష్యమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పుష్ప ది రూల్ రిలీజ్ కు మరో 4 నెలల సమయం మాత్రమే ఉంది. పుష్ప ది రైజ్ సినిమాను ఎన్నో రెట్లు మించి పుష్ప ది రూల్ ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

టీజర్ విషయంలో కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపించినా ట్రైలర్ తో ఆ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని బన్నీ (Allu Arjun) ఫ్యాన్స్ చెబుతున్నారు. 2024 బిగ్గెస్ట్ హిట్ గా పుష్ప ది రూల్ నిలుస్తుందని బన్నీ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత బన్నీ త్రివిక్రమ్ (Trivikram) సినిమాతో బిజీ కానున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus