Pushpa2 The Rule: కాస్త తగ్గితే బెటర్ పుష్ప!

అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar). కాంబినేషన్‌లో రూపొందిన “పుష్ప 2: ది రూల్” (Pushpa2 The Rule) మొదటి రోజే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం, మొదటి రోజు రికార్డు స్థాయి కలెక్షన్లను సాధించింది. ప్రీమియర్ షోలు, డే-1 కలెక్షన్లు కలిపి, పుష్ప 2 ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద తన శక్తిని చూపించింది. అయితే, మొదటి రోజు హవా కొనసాగుతుందా లేదా అనేదే ఇప్పుడు ట్రేడ్ సర్కిల్స్‌లో పెద్ద చర్చగా మారింది.

Pushpa2 The Rule

రెండవ రోజు టికెట్ అమ్మకాలు మొదటి రోజుతో పోలిస్తే కొంత తగ్గినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో, ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం వంటి ప్రాంతాల్లో టికెట్ ధరలపై విమర్శలు రెండవ రోజుకి ప్రతికూల ప్రభావం చూపించాయి. టికెట్ ధరలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ సంఖ్య గణనీయంగా తగ్గిందని థియేటర్ యాజమాన్యాలు చెబుతున్నాయి. సౌత్‌లోనే కాకుండా నార్త్ మార్కెట్లో కూడా సెకండ్ డే బుకింగ్స్ కొంత స్లోగా ఉన్నాయని సమాచారం.

ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇది ఎక్కువగా టికెట్ ధరల ప్రభావం కావచ్చు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఆడియన్స్ సంఖ్య తగ్గడంతో వసూళ్లను ప్రభావితం చేస్తోంది. ఇదే సమయంలో, “పుష్ప 2” కంటెంట్ మాత్రం బలంగా ఉండటంతో, వీకెండ్‌లో మళ్లీ కలెక్షన్లు పెరగొచ్చనే నమ్మకంతో ట్రేడ్ అనలిస్ట్‌లు ఉన్నారు. సినిమాలోని మాస్ యాక్షన్ సీన్లు, అల్లు అర్జున్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించగలవని విశ్వసిస్తున్నారు.

కానీ, సెకండ్ డే టిక్కెట్ రేట్ల కారణంగా బాక్సాఫీస్‌పై ప్రభావం చూపకమానదు. మొత్తం మీద, రెండవ రోజు కలెక్షన్లను బట్టి సినిమా టార్గెట్ ను ఎంత త్వరగా అందుకుంటుంది అనే విషయంలో క్లారిటీ రానుంది. ట్రేడ్ సర్కిల్స్‌లో “పుష్ప 2” వీకెండ్ మొత్తం మీద 400 కోట్లు గ్రాస్ టార్గెట్‌ను చేరగలదా అనే ఆసక్తి నెలకొంది. ఇక టికెట్ ధరల విషయంలో మేకర్స్ కాస్త తగ్గితే బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

టాప్ ఫుట్ ఫాల్స్ మూవీస్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus