Pv Sindhu: ఆ హీరో సినిమాలు నచ్చవన్న పీవీ సింధు.. వాళ్లకు నచ్చొచ్చంటూ?

మన దేశంలోని ప్రజలకు రాజకీయాలు, సినిమాలు తర్వాత ఆ స్థాయిలో క్రీడలపై ఆసక్తి ఉంటుందనే సంగతి తెలిసిందే. క్రీడల ద్వారా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపును సొంతం చేసుకున్న పీవీ సింధు బ్యాడ్మింటన్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన పీవీ సింధు ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. స్టార్ హీరో ప్రభాస్ తన క్రష్ అని ఆమె అన్నారు. బ్యాడ్మింటన్ ఆడటం వల్ల ఎదురయ్యే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడం కోసం సినిమాలు చూస్తానని పీవీ సింధు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టమని పీవీ సింధు వెల్లడించారు. విజయ్ దేవరకొండ సినిమాలు చూశాను కానీ నాకు అంతగా నచ్చలేదని ఆమె తెలిపారు. ఆ సినిమాల పేర్లు చెబితే వివాదం అవుతుందని పీవీ సింధు కామెంట్లు చేశారు. నాకు నచ్చని సినిమాలు నచ్చేవాళ్లు ఉంటారని పీవీ సింధు వెల్లడించారు. సినిమాల విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుందని ఆమె తెలిపారు. ఏ హీరో అయినా సినిమా సక్సెస్ కావాలనే సదుద్దేశంతోనే సినిమాలు చేస్తారని పీవీ సింధు చెప్పుకొచ్చారు.

వాళ్లపై కూడా ఒత్తిడి ఉంటుందని పీవీ సింధు కామెంట్లు చేశారు. సినిమా హిట్టవుతుందో ఫ్లాపవుతుందో తెలీదు కానీ నెలల తరబడి షూట్ చేస్తారని ఆమె అన్నారు. వాళ్ల కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదని పీవీ సింధు వెల్లడించారు. పీవీ సింధు సినిమాల్లోకి వస్తుందని ప్రచారం జరగగా ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ఆమె చెప్పుకొచ్చారు. ఆటపైనే ప్రస్తుతం దృష్టి పెట్టానని భవిష్యత్తులో సినిమాలపై ఫోకస్ చేస్తానో లేదో చెప్పలేనని (Pv Sindhu) పీవీ సింధు పేర్కొన్నారు.

తన బయోపిక్ లో దీపికా పదుకొనే నటిస్తే బాగుంటుందని ఆమె చెప్పుకొచ్చారు. పీవీ సింధు వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భవిష్యత్తులో పీవీ సింధు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus