PVR , Inox Multiplexes: ‘పీవీఆర్’ ‘ఐనాక్స్’..ల మండిపడుతున్న సినీ అభిమానులు..!

ఇప్పుడు థియేటర్లకు జనాలు రావడం బాగా తగ్గించేశారు. అందుకు కారణం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే చాలా మంది నిర్మాతలు.. ముఖ్యంగా దిల్ రాజు (Dil Raju) వంటి అగ్ర నిర్మాతలు చెప్పకనే చెప్పారు. ‘నిత్యావసర ధరలు పెరిగిపోవడం, ఓటీటీల్లోకి 4 వారాల్లో సినిమా అందుబాటులోకి వచ్చేయడం’ వంటి కారణాల వల్ల.. జనాలు థియేటర్లకి రావడం తగ్గించారు అని పలు సందర్భాల్లో దిల్ రాజు చెప్పడం జరిగింది. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో సింగిల్ స్క్రీన్స్ మూతపడ్డాయి.

PVR , Inox Multiplexes

మొన్నామధ్య ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) సినిమా వచ్చినప్పుడు కొన్ని సింగిల్ స్క్రీన్స్ తిరిగి ఓపెన్ అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ కొన్ని సింగిల్ స్క్రీన్స్ మూతపడటం వంటివి చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సాధారణ టికెట్ రేట్లు కూడా రూ.175 , రూ.295 గా ఉన్నాయి. మిడ్ రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలకి కూడా అంత పెట్టి జనాలు థియేటర్లకు ఎందుకు వస్తారు.

ఈ విషయం అందరికీ తెలుసు. అందుకే ‘పీవీఆర్’ (PVR) ‘ఐనాక్స్’ వంటి సంస్థలు వీక్ డేస్లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ‘మూవీ పాస్ పోర్ట్’ ని ప్రవేశపెట్టింది. రూ.349 చెల్లిస్తే నెలకి 4 సినిమాలు.. అది వీక్ డేస్ లో కేవలం రూ.27 లకి చూడొచ్చు. అయితే పెద్ద సినిమాలకి కానీ, పబ్లిక్ హాలిడేస్ ఉన్నప్పుడు వీక్ డేస్ లో కూడా ఈ పాస్ పనిచేయదు. గత వారం రిలీజ్ అయిన విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ (The Greatest of All Time) చిత్రానికి వీక్ డేస్ లో కూడా ఈ మూవీ పాస్ పోర్ట్ పనిచేయడం లేదు.

దీనిపై సోషల్ మీడియాలో చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘పీవీఆర్’ (PVR) ‘ఐనాక్స్’ సంస్థలు ఈ మూవీ పాస్ పోర్ట్ తో చేటు చేస్తున్నట్టు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఈ పాస్ దయచేసి ఎవ్వరూ కొని మోసపోకండి’ అంటూ కొంతమంది నెటిజెన్లు కామెంట్లు పెడుతున్న సందర్భాలు కూడా మనం గమనించవచ్చు.

నటి ప్రగతి కూతురు ఎంత అందంగా ఉందో చూడండి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus