Pragathi: నటి ప్రగతి కూతురు ఎంత అందంగా ఉందో చూడండి..!

సీనియర్ నటి ప్రగతి (Pragathi) .. పరిచయం చేయాల్సిన పనిలేదు. ఒంగోలుకి చెందిన ఈమె తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించి పాపులర్ అయ్యింది. కానీ హీరోయిన్ గా సక్సెస్ రాకపోవడం.. ఫ్యామిలీ లైఫ్ లో కూడా కొంచెం సమస్యలు రావడంతో.. కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంది. అయితే 2002 లో వచ్చిన మహేష్ బాబు (Mahesh Babu) , దర్శకుడు శోభన్ (Sobhan)..ల ‘బాబీ’ (Bobby) తో తెలుగులోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటినుండి వరుస సినిమాల్లో నటిస్తూ వస్తోంది ఈమె.

Pragathi

ఈ క్రమంలో ‘దూకుడు’ (Dookudu) ‘ఎఫ్ 2 ‘ (F2 Movie) ‘బాద్ షా’ (Baadshah) ‘ఎఫ్ 3 ‘ (F3 Movie) వంటి సినిమాలు ఈమె సెకండ్ ఇన్నింగ్స్ బాగా ఉపయోగ పడ్డాయి. ఇంకో రకంగా కోవిడ్ కూడా ఈమెకి బాగా ఉపయోగపడింది అని చెప్పాలి. ఆ టైంలో ఈమె సోషల్ మీడియాని వాడినంత మరెవ్వరూ వాడి ఉండరేమో. తనలోని మరో యాంగిల్ ను చూపిస్తూ డాన్స్ వీడియోలు, జిమ్ వీడియోలు షేర్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఇక ప్రగతి (Pragathi) సింగిల్ మథర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఆమెకి కొడుకు, కూతురు ఉన్నారు.

వీరిద్దరే సర్వస్వంగా జీవిస్తుంది. అప్పుడప్పుడు వీరి ఫోటోలను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉండగా.. ప్రగతి తన కూతురు గీతతో దిగిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో గీత చాలా అందంగా కనిపిస్తుంది. ఆమె వయసు ఇప్పుడు 19 ఏళ్ళు. ‘కాబట్టి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే బాగా రాణిస్తుంది’ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అది జరుగుద్దో లేదో మనం చెప్పలేం కానీ.. ప్రస్తుతానికి ఈమె ఫోటో అయితే ప్రగతి (Pragathi) ఫాలోవర్స్ ని ఆకర్షిస్తుంది.

ఆ సంస్థతో ప్రత్యేకమైన అనుబంధం.. సాయితేజ్ కామెంట్స్ వైరల్!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus