డ్రగ్స్ కేసుల విచారణలో సినీ స్టార్స్ పైనే మీడియా ఫోకస్ పెట్టడంపై పలువురు సినీ పెద్దలు మీడియాపై విరుచుకుపడ్డారు. తాజాగా విప్లవ కథల కథానాయకుడు ఆర్ నారాయణ మూర్తి స్పందించారు. సినిమా వాళ్ళు మాత్రమే డ్రగ్స్ వాడుతున్నారా ?, అలా అందరూ అనుకునేలా మీడియా భ్రమ కల్పిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ కేసులో కేవలం సినిమా రంగాన్నే టార్గెట్ చేయటం సరికాదని సూచించారు. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, పెద్ద కంపెనీలకు చెందిన ఉద్యోగులు కూడా డ్రగ్స్ వాడుతున్నారని చెప్పారు.
వాళ్లందరిని వదిలేసి.. సినిమా వాళ్ల మీదనే ఫోకస్ చేయటం సరికాదని మీడియా వారికి హితవుపలికారు. దేశంలో 1960 నుంచి డ్రగ్స్ వాడకం ఉందని, దీన్ని అరికట్టే విధంగా పోలీసుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే డైరక్టర్ పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, హీరో తరుణ్ తదితరులను విచారించిన సిట్ బృందం .. ఆగస్టు 2 వరకు మరికొంతమందిని విచారించనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.