ఎన్టీఆర్ చిత్రంలో లక్ష్మీరాయ్ ఐటెం సాంగ్
- January 25, 2017 / 11:50 AM ISTByFilmy Focus
ప్రత్యేక గీతాల సుందరి లక్ష్మి రాయ్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ కన్ను పడింది. ఈ భామ ఖైదీ నంబర్ 150 మూవీలో మెగాస్టార్ చిరంజీవితో స్టెప్పులేసి అదరగొట్టింది. రత్తాలు పాటతో యువతకు నిద్ర లేకుండా చేసింది. ఈ పాట తారక్ ని సైతం ఆకట్టుకుంది. అతనికి లక్ష్మి రాయ్ లోని జోష్ నచ్చింది. అందుకే బాబీ దర్శకత్వంలో చేయనున్న మూవీలో ఈ భామతో ఐటెం సాంగ్ చేయాలనీ ఫిక్స్ అయ్యారంట. అదే విషయాన్నీ బాబీ కి చెప్పడంతో అతను కూడా సై అన్నట్లు తెలిసింది. బాబీ డైరక్షన్లో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలోను లక్ష్మి రాయ్ “తోబా తోబా” అనే స్పెషల్ సాంగ్ లో దుమ్ము రేపింది. సో ఆమెతో మళ్లీ ప్రత్యేక గీతం చేయించడానికి డైరక్టర్ ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో భారీ బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపించనున్నారు. వారి సరసన ముగ్గురు అందమైన భామలు ఆడి పాడనున్నారు. వీరితో పాటు లక్ష్మీరాయ్ అందాలు చిత్రానికి గ్లామర్ ని పెంచనున్నాయి. జై లవకుశ అనే టైటిల్ అనుకుంటున్న ఈ మూవీ వచ్చే నెల 10వ తేదీన సెట్స్ మీదకు వెళ్లనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














